AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో తెలుసుకోండి!

Snake in house beliefs Telugu: ఇంట్లోకి పాము వస్తే శుభమా, అశుభమా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నల్ల, తెల్ల, గోధుమ, పసుపు, ఆకుపచ్చ రంగుల పాములను బట్టి మన సంప్రదాయాల్లో అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. పాము కనిపిస్తే అదృష్టం కలుగుతుందా? పాములు ఇళ్లలోకి ఎందుకు వస్తాయి? ఈ నమ్మకాల వెనుక ఉన్న విషయాలు, శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకుందాం.

ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో తెలుసుకోండి!
Snake In House Beliefs Telugu
Rajashekher G
|

Updated on: Oct 29, 2026 | 2:12 PM

Share

Snake in house beliefs Telugu: పామును చూడగానే చాలామందికి భయం కలుగుతుంది. ముఖ్యంగా పల్లెటూర్లలో అప్పుడప్పుడు పాములు ఇళ్లలోకి రావడం సహజంగా జరుగుతుంటుంది. అయితే ఇంట్లోకి పాము రావడాన్ని కొందరు అశుభంగా భావిస్తే, మరికొందరు నాగదేవత తమ ఇంటికి వచ్చిందని భావించి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా పాము రంగును బట్టి శుభసూచకాలు, భవిష్యత్తులో జరిగే పరిణామాలను అంచనా వేస్తుంటారు. మరి ఈ నమ్మకాల వెనుక ఉన్న విశేషాలేంటో తెలుసుకుందాం.

సంప్రదాయ నమ్మకాల ప్రకారం, ఇంట్లో నల్లపాము కనిపిస్తే అది శుభసంకేతమని కొందరు భావిస్తారు. నల్లపాము కనిపించడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అయితే అన్ని నల్లపాములు హాని చేయవని భావించడం సరికాదు. పాము ఏ రంగులో ఉన్నా దానికి దూరంగా ఉండటమే మంచిది.

అలాగే, గోధుమ రంగు పాము ఇంట్లోకి వస్తే పరమశివుని ఆశీస్సులు లభిస్తాయని, ఆర్థికంగా మంచి రోజులు వస్తాయని కొందరి విశ్వాసం. నలుపు, గోధుమ రంగులు కలగలిసిన పాములు కనిపిస్తే దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని, సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

ఇక తెల్లటి లేదా వెండి వర్ణంలో ఉండే పాము కనిపించడం అత్యంత అదృష్టంగా భావిస్తారు. అలాంటి పాము ఇంటి ఆవరణలో కనిపిస్తే ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని కొందరు నమ్ముతారు. పసుపు రంగు పాము కనిపిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి సంకేతమని భావిస్తారు. ఆకుపచ్చ పాము ఇంట్లోకి వస్తే సమస్యలు తొలగిపోయి, మనశ్శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయని చెబుతుంటారు.

అయితే, ఇవన్నీ సంప్రదాయ విశ్వాసాలు మాత్రమే. పాము రంగును బట్టి శుభం, అశుభం జరుగుతాయని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణంగా ఆహారం, ఆశ్రయం, చల్లదనం లేదా వేడి నుంచి రక్షణ కోసం పాములు ఇళ్లలోకి రావచ్చు. ఇంట్లో పాము కనిపిస్తే దానిని చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకండి. దానికి దూరంగా ఉండి, శిక్షణ పొందిన పాము రక్షకుల సహాయం తీసుకోండి. సంప్రదాయాలను గౌరవిస్తూనే, మనుషులకూ పాములకూ సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పాముల రంగులను బట్టి శుభం, అశుభం, ఆర్థికాభివృద్ధి లేదా అదృష్టం కలుగుతాయనే విషయాలు సంప్రదాయ నమ్మకాలు, ప్రజల్లో ప్రచారంలో ఉన్న విశ్వాసాల ఆధారంగా వివరించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాములు సాధారణంగా ఆహారం, ఆశ్రయం లేదా అనుకూల వాతావరణం కోసం ఇళ్లలోకి రావచ్చు. పాము కనిపిస్తే దానిని తాకడం, పట్టుకోవడం లేదా చంపడానికి ప్రయత్నించడం చేయకండి. మీ భద్రత కోసం దూరంగా ఉండి, నిపుణులైన పాము రక్షకుల సహాయం తీసుకోండి.)

మరిన్ని ఆసక్తికర జ్యోతిష్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!
Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?
అబ్బబ్బా.. బొచ్చ చేపతో పులసు ఇలా పెట్టారంటే..?
అబ్బబ్బా.. బొచ్చ చేపతో పులసు ఇలా పెట్టారంటే..?
విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు..
విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు..
ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి
ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి
జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు
జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు
రోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!
రోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!
ప్రపంచ ప్రసిద్ధ భారతీయ పర్యాటక ప్రాంతాలు.. మన దేశంలో అద్భుతాలు..
ప్రపంచ ప్రసిద్ధ భారతీయ పర్యాటక ప్రాంతాలు.. మన దేశంలో అద్భుతాలు..