AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోర్డర్ 2 హిట్ తర్వాత అహాన్ శెట్టి నయా యాక్షన్ ధమాకా.. సంకి షూట్‌కు అంతా రెడీ

బోర్డర్ 2 తో సాలిడ్ హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న అహాన్ శెట్టి.. ఇప్పుడు నయా యాక్షన్ అవతారంలోకి దిగిపోతున్నాడు. రుస్తుం ఫేమ్ టిను సురేష్ దేశాయ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సంకి రెగ్యులర్ షూట్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బోర్డర్ 2 హిట్ తర్వాత అహాన్ శెట్టి నయా యాక్షన్ ధమాకా.. సంకి షూట్‌కు అంతా రెడీ
Ahan Shetty
Krishna S
|

Updated on: Oct 29, 2026 | 3:01 PM

Share

బోర్డర్ 2 భారీ విజయంతో మంచి జోరు మీదున్న యువ నటుడు అహాన్ శెట్టి తన తర్వాతి చిత్రంతో మరోసారి పూర్తిస్థాయి యాక్షన్‌కు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం సంకి అక్టోబర్ 30 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది.  అక్షయ్ కుమార్‌తో రుస్తుం వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను, అలాగే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన మిషన్ రాణిగంజ్ వంటి ఉత్కంఠభరిత చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు టిను సురేష్ దేశాయ్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిభావంతుడైన రచయిత జ్ఞానేంద్ర వాసుదేవ్ ఈ చిత్రానికి అద్భుతమైన కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. దశలవారీగా సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

భోపాల్‌లో భారీ సన్నాహాలు

ఈ సినిమా కేవలం రొటీన్ యాక్షన్ మూవీగా మాత్రమే కాకుండా అంతర్లీనంగా బలమైన భావోద్వేగాలు నిండిన ఒక వినూత్నమైన ప్రేమకథగా రూపొందనుంది. అసలైన రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తోంది. కాగా ఈ చిత్ర కథాంశంపై ప్రస్తుతం మేకర్స్ పూర్తి గోప్యత పాటిస్తున్నారు. సినిమాలో అహాన్ పాత్ర తీరుతెన్నులు, హీరోయిన్ ఎవరు, ఇతర తారాగణం వివరాలను త్వరలోనే దశలవారీగా అధికారికంగా వెల్లడించనున్నారు. సంకి సినిమా తొలి షెడ్యూల్‌ను మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరమైన భోపాల్‌లో ప్లాన్ చేశారు. రేపటి నుంచి కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనుండటంతో దర్శకుడు టిను సురేష్ దేశాయ్ తన భారీ సాంకేతిక బృందంతో ఇప్పటికే భోపాల్ చేరుకున్నారు. లొకేషన్లలో అన్ని ఏర్పాట్లను పరిశీలించి, షూటింగ్‌కు సంబంధించిన తుది సన్నాహాలను పూర్తి చేశారు.

2027లో రిలీజ్..!

ఈ భారీ యాక్షన్ డ్రామాను ప్రముఖ నిర్మాణ సంస్థలు వీ ది పీపుల్, రోరింగ్ రివర్ ప్రొడక్షన్స్, పాల్స్ అండ్ పియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అత్యున్నత సాంకేతిక విలువలతో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ చిత్రాన్ని 2027 ప్రథమార్ధంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆచితూచి అడుగులు.. వరుస ప్రాజెక్టులతో దూకుడు

బోర్డర్ 2 సూపర్ హిట్ తర్వాత అహాన్ శెట్టి తన భవిష్యత్ చిత్రాల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తొందరపడకుండా బలమైన కథాంశాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే సంకి చిత్రం చేస్తున్న ఆయన.. దీని తర్వాత ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ దర్శకత్వంలో 1920 కోల్డ్ వింటర్ సినిమాతో పాటు మరో రెండు ఆసక్తికర ప్రాజెక్టులను కూడా ఖరారు చేసుకున్నారు. ఈ చిత్రాలు 2027లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

Follow Us
గిరిజన ప్రాంతాల్లో కాఫీ పళ్లను ఎలా సేకరిస్తారో తెలుసా..?
గిరిజన ప్రాంతాల్లో కాఫీ పళ్లను ఎలా సేకరిస్తారో తెలుసా..?
కొత్త నోటిఫికేషన్.. TGPSC 1395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు
కొత్త నోటిఫికేషన్.. TGPSC 1395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు
తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు అండగా కేంద్రం
తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు అండగా కేంద్రం
ఫోన్ వాడి వాడి వేళ్లు నొప్పెడుతున్నాయా?.. ఇలా ఈజీగా చెక్ పెట్టండి
ఫోన్ వాడి వాడి వేళ్లు నొప్పెడుతున్నాయా?.. ఇలా ఈజీగా చెక్ పెట్టండి
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి తోరణం కట్టాలి? ఈ పొరపాట్లు..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి తోరణం కట్టాలి? ఈ పొరపాట్లు..
బోర్డర్ 2 హిట్ తర్వాత అహాన్ శెట్టి నయా యాక్షన్ ధమాకా..
బోర్డర్ 2 హిట్ తర్వాత అహాన్ శెట్టి నయా యాక్షన్ ధమాకా..
గుడ్ న్యూస్.. తెలంగాణలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలు!
గుడ్ న్యూస్.. తెలంగాణలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలు!
మొన్న భారీ విధ్వంసం.. కట్‌చేస్తే.. జాక్‌పాట్ కొట్టేసిన అభిషేక్..!
మొన్న భారీ విధ్వంసం.. కట్‌చేస్తే.. జాక్‌పాట్ కొట్టేసిన అభిషేక్..!
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..