AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 రోజుల పాటు.. ఉదయాన్నే పరగడుపున కరివేపాకు జ్యూస్‌ అలవాటు చేసుకోండి..అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

భారతీయ వంటశాలల్లో కరివేపాకు ప్రతి ఇంటిలోనూ కనిపిస్తుంది. కూరలకు సువాసన, రుచిని అందించే కరివేపాకును కేవలం పోపు దినుసుగానే కాకుండా, ఒక దివ్య ఔషధంగా ఆయుర్వేదంలో భావిస్తారు. చాలా మంది వంటల్లో కరివేపాకును తీసిపారేస్తుంటారు. కానీ, దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం లోపల నుంచి ఆరోగ్యంగా మారుతుంది. ఈ ఆరోగ్య పానీయం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Oct 29, 2026 | 1:15 PM

Share
మధుమేహం నియంత్రణ: ప్రస్తుత కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారికి కరివేపాకు నీరు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కరివేపాకులోని ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

1 / 5
చర్మ సౌందర్యం, ఆరోగ్యం: కరివేపాకులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని తగ్గించి, వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా కాపాడుతుంది. అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.

2 / 5
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: శరీరంలో పెరిగిపోయిన బరువును, కొవ్వును తగ్గించుకోవడానికి కరివేపాకు నీరు ఒక అద్భుతమైన సహజ నివారణ మార్గంగా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని సేవించడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని మెటబాలిజాన్ని వేగవంతం చేసి, అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

3 / 5
కరివేపాకు నీటిని ఎలా తయారు చేసుకోవాలి?: ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. 5 నుండి 6 తాజా కరివేపాకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఒక గ్లాసు నీటిలో ఈ ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని గోరువెచ్చని స్థితికి వచ్చేలా వడకట్టి, ఉదయాన్నే పరగడుపున సేవించాలి.

4 / 5
మన వంటింట్లో లభించే కరివేపాకు కేవలం వంటల రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున కరివేపాకు మరిగించిన నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక..ఏంటంటే.. ఈ సమాచారం కేవలం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నిపుణులు లేదా వైద్యుల సంప్రదింపులతో దీనిని తీసుకోవడం ఉత్తమం.

5 / 5
Follow Us
30 రోజుల పాటు.. పరగడుపున కరివేపాకు జ్యూస్‌ అలవాటు చేసుకోండి..

శని సాడే సతి ముగిశాక అదృష్టం మారుతుందా? జీవితంలో వచ్చే 5 కీలక..

ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!

అవమానాలను అధిగమించి వైద్యురాలిగా.. రూత్ జాన్ పాల్ విజయగాథ!

దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న జంతువును గుర్తిస్తే మీరే తోపు!

ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి.

ఆ భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటా.. పెద్ది వివాదం పై జాన్వీ..

కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ

అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

మరో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే