AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament: పహల్గామ్‌ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం… లోక్‌సభలో విపక్షాలపై అమిత్‌షా విసుర్లు

పహల్గామ్‌లో పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతకంగా హత్యచేశాని అన్నారు అమిత్ షా...

Parliament: పహల్గామ్‌ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం... లోక్‌సభలో విపక్షాలపై అమిత్‌షా విసుర్లు
Amit Shah
K Sammaiah
|

Updated on: Jul 29, 2025 | 12:49 PM

Share

పహల్గామ్‌లో పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతకంగా హత్యచేశాని అన్నారు అమిత్ షా. కుటుంబాల ముందే పర్యాటకుల్ని దారుణంగా చంపారు. మతం పేరు అడిగి మరీ చంపడం దారుణం అన్న అమిత్‌ షా… పహల్గామ్‌ ప్రతీకారాన్ని ధృవీకరించారు. ఆపరేషన్‌ మహాదేవ్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను బద్రతా బలగాలు మట్టుబట్టాయని స్పష్టం చేశారు. ఈనెల 22న సెన్సార్ల ద్వారా ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు. బైసరస్‌, లిడ్వస్‌లో ఒకే రకమైన ఆయుధాలను ఉగ్రవాదులు వాడినట్లు భద్రతా దళాలు గుర్తించినట్లు అమిత్‌షా తెలిపారు.

ఆపరేషన్‌ సింధూర్‌తో ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేసి ప్రతీకారం తీర్చుకున్నామని అమిత్‌షా వెల్లడించారు. ఉగ్రదాడి జరిగిన రోజునే జమ్ము భద్రతపై సమీక్షించానని చెప్పారు. పహల్గామ్‌ దాడి ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ము పోలీసులకు అభినందనలు తెలిపారు అమిత్‌షా. ఈ నెల 22న శాటిలైట్‌ ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా గ్రవాదుల ఆచూకీ తెలిసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినవారిని కూడా అరెస్ట్ చేశామన్నారు హోంమంత్రి అమిత్‌షా.

ఉగ్రవాదులను అంతమొందించామని చెప్పగానే విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తాయనుకున్నా. కానీ, కానీ విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని అమిత్‌షా విమర్శించారు. ఉగ్రవాదులు చనిపోయారన్న సంతోషం కూడా విపక్షాలకు లేదని అమిత్‌ షా ఆరోపించారు.

వీడియో చూడండి:

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..