గాల్లో తేలినట్టుందే కాదు.. గాల్లో కూలినట్టుందే! బెంబేలెత్తిపోతున్న సగటు ఎయిర్ ప్యాసింజర్
గాల్లో తేలినట్టుందే కాదు.. గాల్లో కూలినట్టుందే! అని బెంబేలెత్తిపోతున్నాడు ఎయిర్‌ప్యాసింజర్. విమానం ఎక్కాలంటేనే గుండెమీద రాయిపెట్టి కొట్టినట్టు భయపడిపోతున్నాడు. అహ్మదాబాద్ ఘోరకలి తర్వాత విమాన ప్రయాణం ఎంతవరకు సేఫ్ అనే పాత ప్రశ్న మళ్లీ మొలకెత్తి.. సగటు ఎయిర్ ప్యాసింజర్ బిక్కుబిక్కు మంటూ గడిపేస్తున్నాడు. ప్రయాణికుడ్నే కాదు.. పైలెట్లను కూడా వెంటాడుతోంది ప్రాణభయం. అహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత 112 మంది పైలెట్లు సిక్ లీవ్ పెట్టి ఇంట్లో కూర్చున్నారట.

”విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించాం… వెంటనే సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేశారు.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం.. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించేశాం.. అంతరాయానికి చింతిస్తున్నాం..” ఇవి ఇటీవల ఎయిర్‌పోర్ట్స్‌లో తరచూ వినిపిస్తున్న మాటలు. కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం, ల్యాండ్ అవుతుండగా రన్‌వేను దాటిపోయి, గేటు వరకు వచ్చి ఆగిపోయింది. భారీ వర్షం కురవడం వల్లే ఈ ఘటన జరిగిందని సర్దిచెప్పుకుంటూ ఎయిరిండియా రాసుకున్న క్షమాపణ పత్రం ఇది. 24 గంటలు గడవకముందే అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంకోటి. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్‌కు ముందే అహ్మదాబాద్ ఏర్‌పోర్ట్‌లోనే నిలిచిపోవడంతో 160 మంది ప్యాసింజర్లకు ముప్పు తప్పింది. అదే అహ్మదాబాద్‌లో తప్పిన మరో ముప్పు.. ! డయ్యూకు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్లో సాంకేతిక లోపం ఏర్పడి… టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందు సర్వీసును రద్దు చేశారు. అదే రోజు ఇంకోటి…! కేరళలోని కాలికట్ నుంచి దోహాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 375… రెండు గంటల ప్రయాణం తర్వాత విమానం క్యాబిన్ ఏసీలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు గుర్తించి.. టేకాఫ్అయిన ఎయిర్‌పోర్టుకే తిరిగివచ్చి సేఫ్ ల్యాండింగ్ చేశారు. పైలట్లు, సిబ్బంది సహా 188 మంది సేఫ్. జూలై 23.. బుధవారం ఒక్క రోజే రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు రావడంతో సగటు...




