PM Modi UK Visit: కింగ్ చార్లెస్‌కు ప్రత్యేక బహుమతి ఇచ్చిన ప్రధాని మోదీ.. ట్రేడ్ డీల్‌పై విషయాలివే
బ్రిటన్‌లో ప్రధాని మోదీ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. మోదీ టూర్‌తో ఏపీ ఆక్వా రైతులకు ఎంతో మేలు జరగబోతోంది. ఆక్వా ఉత్పత్తులపై బ్రిటన్ సుంకాలను తొలగించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.

బ్రిటన్‌లో ప్రధాని మోదీ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. మోదీ టూర్‌తో ఏపీ ఆక్వా రైతులకు ఎంతో మేలు జరగబోతోంది. ఆక్వా ఉత్పత్తులపై బ్రిటన్ సుంకాలను తొలగించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. చారిత్రత్మక ఫ్రీ ట్రేడ్ డీల్‌పై ప్రధాని మోదీ , కీర్ స్టార్మర్ సంతకాలు చేశారు. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య బలమైన దౌత్య సంబంధాలకు ఇది నిదర్శనమన్నారు.
ఇదిలా ఉంటే.. గురువారం రెండు దేశాల మధ్య జరిగిన ట్రేడ్ డీల్ అనంతరం యూకేలోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌లో కింగ్ చార్లెస్-3ని కలిశారు ప్రధాని మోదీ. వీరిరువురి సమావేశం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా జరిగింది. ఇదే విషయాన్ని బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కింగ్ చార్లెస్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ఓ బహుమతిని అందించినట్టుగా పేర్కొంది. కింగ్ చార్లెస్‌కు ప్రధాని మోదీ ఓ మొక్కను బహుకరించారు. “ఏక్ పెడ్ మా కే నామ్”లో భాగంగా ప్రధాని మోదీ ఈ బహుమతిని కింగ్ చార్లెస్‌కు అందించగా.. ప్రతీ వ్యక్తి తమ తల్లుల గౌరవార్ధం ఓ మొక్కను నాటమని ఈ క్యాంపెయిన్ ప్రోత్సహిస్తుంది. కింగ్ చార్లెస్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన మొక్కను సోనోమా డోవ్ ట్రీ(Sonoma Dove Tree) అని పిలుస్తారు. ఈ మొక్కలు కేవలం అలంకారానికి మాత్రం ఉపయోగపడతాయి. ఇది పూర్తిగా చెట్టు అవ్వడానికి సుమారు రెండు దశాబ్దాల సమయం పడుతుందని జాతీయ కథనాలు పేర్కొన్నాయి.
ఇక రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ విషయానికొస్తే.. బ్రిటన్‌తో చారిత్మాత్మక వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకాలు చేసింది. ఇండో-బ్రిటన్ ట్రేడ్ డీల్‌తో ఏపీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన ఆక్వా రైతులకు ఎంతో మేలు జరగబోతోంది. బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే దుస్తులు , లగ్జరీ కార్లు , విస్కీ ధరలు తగ్గబోతున్నాయి. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్య 120 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ డీల్‌తో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది. భారత వ్యవసాయ ఉత్పత్తులకు బ్రిటన్ సుంకాలు తొలగించింది. ఫిషరీస్ రంగంలో కూడా ఒప్పందం కుదిరింది. ఏపీ , ఒడిశా , కేరళ , తమిళనాడు లాంటి రాష్ట్రాలకు ఈ డీల్‌తో చాలా మేలు జరగనుంది. బ్రిటన్ నుంచి దిగమతి అయ్యే లగ్జరీ కార్లు , విస్కీ ధరలు తగ్గబోతున్నాయి.
బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందంతో భారతీయ రైతులకు చాలా మేలు జరుగుతుందన్నారు ప్రధాని మోదీ. ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దక్కిందన్నారు. రెండు దేశాల్లో పెట్టుబడులు పెరుగుతాయన్నారు. యంగ్ క్రికెటర్లతో మమేకమయ్యారు మోదీ. క్రికెట్ ఒక క్రీడ మాత్రమే కాదని జీవిత విధానమన్నారు. పహల్గామ్ దాడిని ఖండించినందుకు బ్రిటన్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజుల పాటు బ్రిటన్‌లో మోదీ పర్యటన కొనసాగుతుంది. తరువాత మాల్దీవుల పర్యటనకు వెళ్తారు మోదీ.
This afternoon, The King received the Prime Minister of the Republic of India, @NarendraModi, at Sandringham House. 🇮🇳
During their time together, His Majesty was given a tree to be planted this Autumn, inspired by the environmental initiative launched by the Prime Minister, “Ek… pic.twitter.com/9nhigoCgkw
— The Royal Family (@RoyalFamily) July 24, 2025




