కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ రెండు సంస్థలూ ఇక ‘మార్కెట్‌లో’..

భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను మార్చి 2020లోపు అమ్మనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఈ రెండు కంపెనీలలో కేంద్రం పెట్టుబడులను పెట్టగా.. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ .1 లక్ష కోట్ల రాబడులను సమీకరించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రెండు కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇక ఎయిర్ ఇండియా […]

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ రెండు సంస్థలూ ఇక 'మార్కెట్‌లో'..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 17, 2019 | 5:38 PM

భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను మార్చి 2020లోపు అమ్మనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఈ రెండు కంపెనీలలో కేంద్రం పెట్టుబడులను పెట్టగా.. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ .1 లక్ష కోట్ల రాబడులను సమీకరించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రెండు కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇక ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు రూ.58,000 కోట్ల అప్పుల్లో ఉండగా ఆర్ధికమంత్రి నుంచి ఇటువంటి ప్రకటన రావడం గమనార్హం. 

ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లోహాని.. పెట్టుబడులు ఉపసంహరణ సంస్థ స్థిరత్వానికి దోహదపడుతుందంటూ గతంలోనే ఉద్యోగులందరికీ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అదే విధంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ చెందిన 53.29శాతం వాటాను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశాన్ని ఆర్ధిక సంక్షోభం పట్టి పీడిస్తుండగా.. వివిధ రంగాల్లో మాంద్యం ఏర్పడిందని… దాన్ని అధిగమనించడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందంటూ నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఆర్ధిక సంవత్సరం బ్యాలన్స్ షీట్ మెరుగుపడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం విధించిన జీఎస్టీ వసూళ్ల వల్ల కొన్ని రంగాల్లో అమ్మకాలు అభివృద్ధి చెందాయన్నారు. అటు సుప్రీం కోర్టు.. ఎస్సార్ స్టీల్‌‌కు సంబంధించి ఇచ్చిన తీర్పు కూడా ఐబీసీ చట్ట రాజ్యాంగబద్దతను, చట్టబద్దతను బలోపేతం చేసిందన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాతో పాటు ఆయిల్ రిఫైనర్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బిపిసిఎల్)ను 2020 మార్చి నాటికి అమ్మేందుకు సిద్ధపడిందని తెలిపారు. మరి ఆర్ధిక మందగమనాన్ని నిర్మూలించడం కోసం కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి..?