Asaduddin Owaisi: ‘గాడ్సేని కూడా సమర్థిస్తారు’.. కేంద్ర ప్రభుత్వంపై మజ్లీస్ అధినేత సంచలన వ్యాఖ్యలు..

విద్యార్థుల పాఠ్యాంశ పుస్తకాల నుంచి మొఘల్స్ చరిత్రను తొలగించిన నేపథ్యంలో మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకే ఎన్‌సీఐఆర్‌టీ పుస్తకాల నుంచి మోఘల్ చరిత్రను తొలగించారని ఆయన ఆరోపించారు...

Asaduddin Owaisi: ‘గాడ్సేని కూడా సమర్థిస్తారు’.. కేంద్ర ప్రభుత్వంపై మజ్లీస్ అధినేత సంచలన వ్యాఖ్యలు..
Aimim Chief Asaduddin Owaisi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 05, 2023 | 8:33 PM

విద్యార్థుల పాఠ్యాంశ పుస్తకాల నుంచి మొఘల్స్ చరిత్రను తొలగించిన నేపథ్యంలో మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకే ఎన్‌సీఐఆర్‌టీ పుస్తకాల నుంచి మోఘల్ చరిత్రను తొలగించారని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొఘల్ చరిత్రను పుస్తకాల నుంచి చెరిపేస్తోందన్నారు. అంతేకాక పిల్లలకు ద్వేషాన్ని కూడా బోధిస్తున్నారని కూడా ఆరోపించారు. అదే క్రమంలో పుస్తకాల నుంచి 2002 గుజరాత్ అల్లర్ల సమాచారాన్ని తొలగించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పుస్తకాల నుంచి తొలగించిన విషయం విద్యార్థులకు విలువైన సమాచారమని.. ఆ విషయాలను అధ్యయనం చేయడం ద్వారా పిల్లలు తమ పెద్దల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోగలుగుతారని ఓవైసీ పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ హిందూ-ముస్లిం ఐక్యతను నమ్మినందునే గాడ్సే చేతుల్లో చనిపోయారని, బీజేపీ ప్రభుత్వం పుస్తకాలం నుంచి ఆర్‌ఎస్‌ఎస్ నిషేధం, ప్రజాస్వామ్యం వంటి పలు విషయాలను తొలగించిందని ఒవైసీ ఆరోపించారు. దీని ద్వారా బీజేపీ పిల్లలకు ద్వేషాన్ని నేర్పిస్తోందని ఆయన దూయబట్టారు. బీజేపీ ప్రభుత్వం రానున్న కాలంలో నాధురామ్ గాడ్సేని కూడా సమర్థిస్తుందని,  ఆ రోజు దూరంలో అయితే లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఆయన ట్వీట్ చేస్తూ గాడ్సే, సావర్కర్‌లను స్నేహితులుగా అభివర్ణించారు.

స్క్రీన్‌షాట్ 2023 04 05 181526

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..