Kerala: కేరళలోని రైలులో ప్రయాణికుడికి నిప్పంటించిన నిందితుడు అరెస్టు..
కేరళలో తోటి ప్రయాణికుడిపై నిప్పంటించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల కోసం మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటిలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ లు నిర్వహించారు.

కేరళలో తోటి ప్రయాణికుడిపై నిప్పంటించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల కోసం మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటిలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ లు నిర్వహించారు. చివరకీ ప్రధాన నిందుతుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రోజున రైల్వే పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే నిందితుడు ఉత్తరప్రదేశ్ కి చెందిన షారుఖ్ సైఫీగా గుర్తించారు.కేరళలో ఆ ఘటన జరిగిన అనంతరం రైలు నుంచి దిగుతుండగా నిందితుడు కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆ చికిత్స పూర్తికాక ముందే ఆ ఆసుపత్రిలో నుంచి పారిపోయాడు.
ఆ నిందితుడి కోసం గాలించగా చివరికి రత్నగిరి ప్రాంతంలో సోదాలు నిర్వహించి షారుఖ్‌ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు రత్నగిరి రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడని పేర్కొన్నారు. అయితే ఈ దారణమైన ఘటన కొజికోడ్ లోని అలపూజా-కన్నూరు ఎక్స్ ప్రెస్ రైలులో జరిగింది. ఆ రోజు నిందితులు కదిలే రైలులో తోటి ప్రయాణికుడికి నిప్పంటించడంతో ఎనిమిదికి తీవ్ర గాయాలయ్యాయి. అలగే మరో ముగ్గురు పట్టాలపై పడిపోవడంతో మృతి చెందారు.