AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు పట్టాలపై పడిపోయిన చెట్టు.. రైలు వస్తుండటాన్ని గమనించిన 70 ఏళ్ల బామ్మ ఏం చేసిందంటే

కర్ణాటకలో ఓ 70 ఏళ్ల బామ్మ తన సమయస్పూర్తితో ఓ రైలను పెను ప్రమాదం నుంచి రక్షించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రైలు పట్టాలపై పడిపోయిన చెట్టు.. రైలు వస్తుండటాన్ని గమనించిన 70 ఏళ్ల బామ్మ ఏం చేసిందంటే
Train
Aravind B
|

Updated on: Apr 05, 2023 | 7:18 PM

Share

కర్ణాటకలో ఓ 70 ఏళ్ల బామ్మ తన సమయస్పూర్తితో ఓ రైలను పెను ప్రమాదం నుంచి రక్షించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెశ్తే కర్ణాటకలోని మంగళూరుకు చెందిన చంద్రవతి అనే మహిళ స్థానికంగా రైల్వే ట్రాక్ దగ్గర నివసిస్తున్నారు. అయితే మార్చి 21 తన ఇంటి ముందు నిలబడి ఉండగా.. ట్రాక్ పై చెట్టు పడిపోవడాన్ని ఆమె గుర్తించారు. ఆరోజున మంగళూరు నుంచి ముంబయికి వెళ్లే మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ ఆ పట్టాలపై వెళ్తుందని ఆమెకు తెలుసు. వెంటనే అప్రమత్తమైన చంద్రవతి రైలు వచ్చే శబ్దాన్ని విని ఇంట్లోకి వెళ్లి ఎర్రటి వస్త్రాన్ని బయటకు తీసుకొచ్చింది. రైలుకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వస్త్రాన్ని ఊపుతూ రైలు ఆపమని సైగలు చేసింది. అయితే ప్రమాదాన్ని ఊహించిన రైలు లోకో పైలట్ వేగాన్ని నెమ్మది చేశారు. దీంతో సరిగ్గా చెట్టు పడిపోయిన ప్రాంతం వద్ద రైలు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం రైల్వే అధికారులు, స్థానికులు ట్రాక్‌ వద్దకు చేరుకుని ఆ చెట్టును తొలగించేశారు. అతి తక్కువ సమయంలోనే ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి వందల మంది ప్రాణాలను కాపాడటంతో అందరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆమె గురించి తెలుసుకున్న రైల్నే ఉన్నతాధికారులు ఇటీవలే చంద్రవతిని సత్కరించారు. ట్రాక్ పై పడి ఉన్న చెట్టును చూసే సరికి ఆ సమయంలో రైలు శబ్దం వినిపించిందని.. అధికారులకు ఈ విషయాన్ని చెప్పేందుకు సమయం లేకపోవడంతో ఇంట్లో నుంచి ఎర్రటి వస్త్రాన్ని తీసుకొచ్చి సైగ చేశానని చంద్రవతి తెలిపింది. రైలు ప్రమాదాన్ని తప్పించేందుకు తనకు గుండె ఆపరేషన్ జరిగిందన్న విషయాన్ని కూడా మర్చిపోయి పరిగెత్తానని పేర్కొంది. ప్రస్తుతం ఈ బామ్మపై నెటీజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
బాక్సాఫీస్ దగ్గర మెరిసిన స్టార్స్.. 2025లో ఊపిరిపోసిన హిట్స్‌
బాక్సాఫీస్ దగ్గర మెరిసిన స్టార్స్.. 2025లో ఊపిరిపోసిన హిట్స్‌
న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా?
న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా?
అంతవరకు కోలాహలం, ఆనందం.. అంతలోనే ఊహకందని విషాదం..
అంతవరకు కోలాహలం, ఆనందం.. అంతలోనే ఊహకందని విషాదం..
టీ20 ప్రపంచకప్‌నకు 3 జట్ల స్వ్కాడ్స్ ఫిక్స్.. డేంజరస్ టీం ఏందంటే?
టీ20 ప్రపంచకప్‌నకు 3 జట్ల స్వ్కాడ్స్ ఫిక్స్.. డేంజరస్ టీం ఏందంటే?
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. ఆపి చెక్‌ చేయగా..
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. ఆపి చెక్‌ చేయగా..
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా..
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా..