- Telugu News Photo Gallery IRCTC Kerala Tour: You Can visit Kerala and feel its Beauty with small Budget check out for Full details
Kerala Tour: ప్రకృతి అందాలను చూడాలంటే కేరళ వెళ్లాల్సిందే.. తక్కువ ఖర్చుతోనే హౌస్‌బోట్‌లు, జలపాతాలను చూసేయండిలా..
IRCTC Kerala Tour: హౌస్‌బోట్‌లు, జలపాతాలు చూడాలంటే కేరళకు వెళ్లాల్సిందే. ప్రకృతి అందాలకు పేరుగాంచిన కేరళను సందర్శించాలనుకునే ఔత్సాహికులు, టూరిస్టుల కోసమే IRCTC ఒక గొప్ప టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
Updated on: Apr 05, 2023 | 8:00 PM

IRCTC Kerala Tour:: గోవాలాగే కేరళ కూడా సందర్శకులకు, ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం. ప్రశాంత వాతావరణం, పచ్చదనం కోసం కేరళను సందర్శించడానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కేరళలోని హౌస్‌బోట్‌లు, జలపాతాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో.. అలాంటి వారి కోసం IRCTC ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.

ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో పర్యాటకులు అలెప్పీలోని జలపాతాలు, మున్నార్ పచ్చదనాన్ని మనసారా చూడవచ్చు. పర్యాటకులు ఈ రెండు ప్రదేశాలకు రైలులో ప్రయాణిస్తారు.

ఈ టూర్ ప్యాకేజీ గురించి చెప్పాలంటే.. ఇది రూ.11,980 నుంచి ప్రారంభమవుతుంది. సందర్శనకు వెళ్లాలనుకునే తెలుగువారు సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.. టూర్ ప్యాకేజీ తీసుకున్నవారిని రైలులో స్లీపర్, థర్డ్ ఏసీ క్లాస్ ద్వారా ప్రజలను కేరళకు తీసుకువెళతారు.

టూర్ బుక్ చేసుకున్న వారికి 3 బ్రేక్ ఫాస్ట్‌లు కూడా ఇస్తారు. ముందుగా ప్రజలను మున్నార్‌కు తీసుకువెళతారు. ఇక్కడ ప్రజలు నేషనల్ పార్క్, టీ మ్యూజియం, ఎకో పాయింట్‌లకు సందర్శిస్తారు.

అదే సమయంలో పర్యాటకులు అలెప్పీలో బ్యాక్ వాటర్స్‌ని కూడా చూస్తారు. IRCTC అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ద్వారా సందర్శకులు చాలా తక్కువ సమయంలో.. తక్కువ బడ్జెట్‌తోనే కేరళలోని రెండు అద్భుతమైన ప్రదేశాల అందాలను ఆస్వాదించగలరు.





























