Narendra Modi: ఈనెల 8,9 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్న మోదీ.. ఎక్కడెక్కడికి వెళ్తారంటే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 8, 9 వ తేదిల్లో తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో పర్యటించనున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 8, 9 వ తేదిల్లో తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో పర్యటించనున్నారు. ముందుగా తెలంగాణలో రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం అలాగే శంకుస్థాపనలు చేయనున్నారు. 8వ తేదిన 11.45 AM గంటలకు ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు వల్ల ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం సుమారు మూడున్నర గంటలు తగ్గనుంది. అనంతరం ప్రధాని మధ్యాహ్నం 12.15 PM గంటలకు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడే ఏయిమ్స్ బీబీనగర్ కు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు అలాగే 5 నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే రైల్వేలకు సంబంధించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను జాతీకి అంకితం చేయనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని చెన్నై విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడ చెన్నై ఎయిర్ పోర్టుకి సంబంధించిన కొత్త ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవనాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎంజీఆర్ చెన్నై రైల్వే స్టేషన్ లో చెన్నై-కొయంబత్తూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తారు. అనంతరం 4.45 PM గంటలకు శ్రీ రామకృష్ణ మఠం 125 వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 PM గంటలకు అల్ స్ట్రోమ్ క్రికెట్ గ్రౌండ్ లోని పబ్లిక్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. అక్కడ పలు రోడ్డు ప్రాజెక్టులకు ఆవిష్కరణ అలాగే శంకుస్థాపన చేస్తారు. 9 వ తేదిన ఉదయం 7.15 AM గంటలకు కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ను ప్రధాని సందర్శిస్తారు. అలాగే ముడుమలై టైగర్ రిజర్వ్ కి కూడా సందర్శించనున్నారు. 11.00 AM గంటలకు మైసురులోని కర్ణాటక స్టేట్ ఒపెన్ యూనివర్శిటీలో ఏర్పాటుచేసిన 50 ఏళ్ల ప్రాజెక్ట్ టైగర్ స్మారకోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
