Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నాటకలో వేడెక్కిన ప్రచార ఘట్టం.. పార్టీ అభ్యర్థులు, నేతలకు కాంగ్రెస్ పెద్దల కీలక సూచన..!

Karnataka Elections 2023:  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

కర్నాటకలో వేడెక్కిన ప్రచార ఘట్టం.. పార్టీ అభ్యర్థులు, నేతలకు కాంగ్రెస్ పెద్దల కీలక సూచన..!
Karnataka Congress
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 05, 2023 | 1:29 PM

Karnataka Elections 2023:  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కర్నాటకలో అధికారాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహాలపై చర్చించిన ఆ పార్టీ జాతీయ స్థాయి ముఖ్యనేతలు.. ఆ రాష్ట్ర నాయకత్వానికి ఆ మేరకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేయొద్దని పార్టీ కార్యకర్తలు, నేతలకు కాంగ్రెస్ పెద్దలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే హిందుత్వ – లౌకికవాదం చర్చకు దారితీసేలా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం సూచనలు చేసినట్లు సమాచారం.

ప్రధాని నరేంద్ర మోదీపై ఏమైనా వివాదాస్పద వ్యక్తిగత విమర్శలు చేస్తే.. ఎన్నికల ప్రచార అజెండాను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ అవకాశాన్ని బీజేపీకి ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ అభ్యర్థులు, నేతలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వక్రీకరణకు గురైనట్లు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. రావణుడిలా మీకేమైనా 100 తలలు ఉన్నాయా? అంటూ ప్రధాని మోదీనుద్దేశించి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రధాని మోదీని రావణుడితో పోలుస్తూ.. గుజరాత్ పుత్రుడిని కాంగ్రెస్ అవమానిస్తోందంటూ బీజేపీ నేతలు తమ ప్రచారంలో ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో ఖర్గే విమర్శలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదే తరహాలో కర్నాటకలోనూ మోదీపై విమర్శలు చేస్తే.. కాంగ్రెస్ నేతల విమర్శలు వక్రీకరణకు గురైయ్యే అవకాశమున్నందున.. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను కాంగ్రెస్ పెద్దలు కోరుతున్నారు.

ప్రచారంలో కాంగ్రెస్ లేవనెత్తే అంశాలు ఇవే..

ఇవి కూడా చదవండి

ఏయే అంశాలను ఎన్నికల ప్రచారంలో లేవనెత్తాలన్న అంశంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు, నేతలకు పార్టీ అధిష్టానం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్యకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రధాన ఎన్నికల హామీలైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా ఇంటి పెద్దకు నెలకు రూ.2000 భృతి, గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు రూ.3000 భృతి, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబ సభ్యులకు తలా 10కేజీల బియ్యం సరఫరా వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాలని సూచినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ అవినీతి పాలనపై కర్నాటక ప్రజలు విసిగి వేసారి పోయారని కర్నాటక పీసీసీ ప్రెసిడెంట్‌ డీకే శివకుమార్‌ విమర్శించారు. 40 శాతం కమీషన్లతో పనిచేస్తున్న సర్కార్‌కు గుణపాఠం చెబుతూ.. కర్ణాటక ప్రజలు చారిత్రక తీర్పును ఇవ్వబోతున్నారని అన్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని, సొంతంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు . కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ సర్కారు తప్పకుండా న్యాయం చేస్తుందన్నారు.

ఏప్రిల్ 9న కోలార్‌లో రాహుల్ మెగా ర్యాలీ..

కర్నాటకలో రాహుల్‌గాంధీ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 9న కోలార్‌లో జై భారత్ పేరుతో జరిగే మెగా ర్యాలీలో రాహుల్‌ పాల్గొంటారు. కోలార్‌లో మోదీ సామాజిక వర్గంపై 2019లో ఏ గ్రౌండ్‌లో అయితే రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు అనర్హత వేటు పడిందో అక్కడే రాహుల్‌ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్నాటకలో పర్యటించనుండటం విశేషం.

224 అసెంబ్లీ స్థానాలు కలిగిన కర్ణాటక అసెంబ్లీకి ఒకే విడతలో మే 10న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి