PM Modi: బండి సంజయ్ అరెస్ట్.. ప్రధాని మోడీ, అమిత్ షా కీలక మంతనాలు.. జేపీ నడ్డా ఆరా..!
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బండి సంజయ్ అరెస్టుపై అధిష్టానం సీరియస్ అయింది. బండి సంజయ్ అరెస్టు గురించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరాతీశారు.
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బండి సంజయ్ అరెస్టుపై అధిష్టానం సీరియస్ అయింది. బండి సంజయ్ అరెస్టు గురించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరాతీశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలతో జేపీ నడ్డా మాట్లాడారు.న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా నాయకులకు సూచనలిచ్చారు.
బండి సంజయ్ ప్రధాని మోడీతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయ్యారు. మోడీతో భేటీ అనంతరం విడిగా నడ్డా, షా సమావేశమయ్యారు. బండి సంజయ్ అరెస్టు, తెలంగాణలో పరిస్థితుల గురించి ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు గురించి ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా చర్చించినట్టు సమాచారం.
కాగా.. బండి సంజయ్ పై కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అక్కడి నుంచి హనుమకొండ తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన్ను జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..