IRCON Recruitment 2023: రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఇర్కాన్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఏయే తేదీల్లోనంటే..

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON).. 34 వర్క్స్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

IRCON Recruitment 2023: రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఇర్కాన్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఏయే తేదీల్లోనంటే..
IRCON
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 05, 2023 | 2:07 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON).. 34 వర్క్స్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్‌ అండ్ టీ, ఎలక్ట్రికల్‌, సివిల్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న వారు 2023, ఏప్రిల్‌ 17వ తేదీ నుంచి 26వ తేదీలోపు సంబంధిత సర్టిఫికెట్లతో సంబంధిత అడ్రస్‌లలో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.36,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫపికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.