Supreme Court: ప్రతిపక్ష పార్టీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై వేసిన పిటీషన్ పై సుప్రీం ఏమందంటే..
సుప్రీం కోర్టులో ప్రతిపక్ష పార్టీలకు చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని..ఇటీవల 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

సుప్రీం కోర్టులో ప్రతిపక్ష పార్టీలకు చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని..ఇటీవల 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమను వేధించేందుకు,బెదిరించేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని పిటీషన్ లో ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం ను కోరారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీల తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మాను సింగ్వీ పిటీషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఈ పిటీషన్ పై స్పందించింది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకునేందుకు తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పేసింది.
ఈ పిటీషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ దీనిపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు విచారణల నుంచి..శిక్షల నుంచి తప్పించుకుకోవాలని మీరు కోరుతున్నారా అని విపక్షల తరపున పిటీషన్ దాఖలు చేసిన అభిషేక్ మాను సింగ్వీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సింగ్వీ ప్రతిపక్ష నాయకులకు ఎటువంటి మినహాయింపును..రక్షణను కల్పించాలని తాను కోరడం లేదని.. కేవలం పక్షపాత ధోరణి లేని చట్టం కోసం మాత్రమేనని బదులిచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే చాలామంది విపక్ష నేతల్ని అరెస్టు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ సింగ్వీ వాదనలను అంగీకరించలేదు.రాజకీయ నాయకులు అయినంత మాత్రానా వారి కోసం సుప్రీం కోర్టు తన మార్గదర్శకాలను, విధానాలను మార్చకోలేదని స్పష్టం చేశారు. ఇటువంటి ఆందోళనలు పార్లమెంట్ లో ప్రశ్నించాలని సూచించారు. ఆ తర్వాత సింగ్వీ తన పిటీషన్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేసే ప్రత్యేక కేసులు, సందర్భాలు వచ్చినప్పడు మళ్లీ కోర్టుకి వస్తానని పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




