Septic Tank: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేద్దామని లోపలికి ముగ్గురు దిగారు..ఆ తర్వాత ఏం జరిగిందంటే
గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహేజ్ లో విషాదం జరిగింది. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి అందులోకి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడాక ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహేజ్ లో విషాదం జరిగింది. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి అందులోకి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడాక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే గల్సిన్‌భాయ్ మునియా(30), పరేశ్ కతారా(31), అనిల్ పర్మార్(24) స్థానిక పంచాయతీ కార్యాలయంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్లారు. అందులో దిగిన వెంటనే వారికి ఊపిరి ఆడలేదు. సాయం చేయాలంటూ అరుపులు, కేకలు పెట్టారు. అక్కడున్న స్థానికులు వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందిని పిలిపించాక వారు ఆ ముగ్గరుని బయటకు తీశారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారు.
సెప్టిక్ ట్యాంక్‌లో విషవాయువు పీల్చడం వల్లే కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ముగ్గురూ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే సెప్టిక్ ట్యాంకులోకి దిగినట్లు స్థానికులు తెలిపారు. గుజరాత్‌లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం రెండు వారాల్లో ఇది రెండోసారి. మార్చి 23న రాజ్‌కోట్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఓ కార్మికుడు మృతి చెందాడు. గుజరాత్ లో గత రెండేళ్లలో మొత్తం 11 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




