Fungal Disease: మొక్కల నుండి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వ్యాధి..ఏంటో తెలుసా.? లక్షణాలు..

అటువంటి శిలీంధ్రాలు కనిపించని సూక్ష్మజీవులు కాబట్టి, అవి కంటికి కనిపించవు. ఇటువంటి శిలీంధ్రాలు మానవ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. రోజువారీ జీవితంలో కూడా మన శరీరానికి హాని కలిగించే, దురద, చర్మంపై దద్దుర్లు కలిగించే అనేక మొక్కలను మనం చూస్తాము.

Fungal Disease: మొక్కల నుండి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వ్యాధి..ఏంటో తెలుసా.? లక్షణాలు..
Fungal Disease
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 05, 2023 | 3:58 PM

ఇంటి చుట్టూ అందమైన మొక్కలు ఉంటే, మన పరిసరాల్లో అనేక కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయి. రకరకాల మొక్కలు, పూలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఇండోర్, అవుట్ డోర్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కళ్లు చెదిరే అందమైన మొక్కల వల్ల మనకు రోగాలు వస్తాయంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పూర్వం మనిషి నుంచి మనిషికి, జంతువు నుంచి మనిషికి వ్యాధులు వ్యాపించేవి. ఇవే కాకుండా కలుషిత నీరు, అపరిశుభ్రమైన గాలి, మురికి వాతావరణం నుంచి కూడా ఇన్ఫెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పుడు మొక్కల వల్ల కూడా మనిషికి కూడా అనారోగ్యం వస్తుందని తెలిసింది. కోల్‌కతాకు చెందిన 61 ఏళ్ల మొక్కల నిపుణుడు మొదటిసారిగా ఫంగల్ వ్యాధికి గురయ్యాడు.

నివేదిక ప్రకారం బాధిత వ్యక్తి..మొక్కల మైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వ్యాధి సోకిన వ్యక్తి చాలా సంవత్సరాలుగా కుళ్ళిపోతున్న పుట్టగొడుగులు, వివిధ మొక్కల శిలీంధ్రాలపై జరిపే పరిశోధనలో ఉంటున్నాడు. అతను అంతుచిక్కని వింత వ్యాధికిగురైనట్టు వైద్యులు నిర్ధారించారు. వైద్య ప్రపంచానికే సవాల్‌గా మారిన ఈ వ్యాధి మొక్కల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు కూడా ఊహించలేదు. ఈ ఫంగస్ మొక్కలలో వెండి ఆకు వ్యాధిని కలిగిస్తుంది.

వ్యాధి సోకిన వ్యక్తి లక్షణాలు: ఒక మొక్కల మైకోలజిస్ట్ మొట్టమొదట బొంగురుమైన స్వరం, దగ్గు, తీవ్రమైన అలసటను అనుభవించాడు. 61 ఏళ్ల వ్యక్తికి తినడం కూడా కష్టంగా మారింది. అతని గొంతులో పారాటేరింజియల్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల అతనికి గొంతు స్క్రాపింగ్ వంటి సమస్యలు ఉన్నాయి. అతనికి మధుమేహం, కిడ్నీ వ్యాధి మొదలైన ఎలాంటి జబ్బులు లేవు, మందులు వాడే చెడు అలవాటు కూడా లేదు.

ఇవి కూడా చదవండి

అది ఎలా సోకింది? : అతను వృక్షశాస్త్రజ్ఞుడు. అనేక సంవత్సరాలు మైకాలజిస్ట్‌గా పనిచేశాడు. చాలా కాలంగా అనేక మొక్కల శిలీంధ్రాలతో పని చేయడం వల్ల అతనికి ఈ ఫంగల్ వ్యాధి సోకింది. కొండ్రోస్టీరియం పెర్ఫ్యూరియం అనే వ్యాధి సోకిందని, రెండు నెలల పాటు యాంటీ ఫంగల్ మాత్రలు ఇవ్వడంతో కోలుకున్నట్లు డాక్టర్ తెలిపారు. సిల్వర్ లీఫ్ ఫంగస్ వ్యాధి గులాబీ కుటుంబానికి చెందిన మొక్కలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫంగస్ సోకిన మొక్క ఆకులు వెండి రంగులోకి మారుతాయి. అటువంటి శిలీంధ్రాలు కనిపించని సూక్ష్మజీవులు కాబట్టి, అవి కంటికి కనిపించవు. ఇటువంటి శిలీంధ్రాలు మానవ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. రోజువారీ జీవితంలో కూడా మన శరీరానికి హాని కలిగించే, దురద, చర్మంపై దద్దుర్లు కలిగించే అనేక మొక్కలను మనం చూస్తాము. అంతే కాకుండా తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఫంగస్ పెరుగుతుంది. తడి బట్టలు, అధిక డియోడరెంట్ల వాడకం వల్ల కూడా ఫంగస్ ప్రభావితమవుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..