- Telugu News Photo Gallery Lemon benefits home remedies lemonade cures every stomach disease Telugu News
నిమ్మకాయలో దాగివున్న అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే.. ఎలా వాడాలో తెలుసుకోవటం ముఖ్యం..
నిమ్మకాయ మనకు చాలా తేలికగా దొరికే ఆహార పదార్థం. చాలా మంది దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటారు. నిమ్మకాయలు పోషకాల సమృద్ధిగా చెబుతారు. నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్‌కు గొప్ప మూలం.
Updated on: Apr 05, 2023 | 1:40 PM

పొట్టలోని చెడు బ్యాక్టీరియాను చంపడానికి ఇది బాగా పని చేస్తుంది. దీని కోసం ముందుగా నిమ్మకాయను కట్ చేసి దాని రసాన్ని ఒక గ్లాసు నీళ్లల్లో కలుపుకుని , సరిపడ ఉప్పు వుసుకుని తాగాలి. ఇలా వారానికి కనీసం 2 సార్లు తాగినట్టయితే... మీరు దాని నుండి చాలా ప్రయోజనం పొందుతారు.

జలుబు, జ్వరం, దగ్గు లేదా గొంతుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఈ సమస్య నుండి బయటపడటానికి గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయను పిండి క్రమం తప్పకుండా తాగాలి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా అడ్డుకుంటుంది.

తరచుగా నోరు పొడిబారిపోవడం, తరచుగా దాహం,తాగునీరు కారణంగా తరచుగా మూత్రవిసర్జన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, నిమ్మకాయ నీరు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది

ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు మీ వయస్సు కంటే అధిక బరువు కలిగి లావుగా ఉంటే, అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో నిమ్మరసం, వేడినీరు తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది.

చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే, మీకు అలాంటి సమస్య ఉంటే, ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకుని తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకం నివారణకు నిమ్మరసం మంచి ఔషధం





























