IRCTC: కేదార్‌నాథ్ వెళ్లేవారికి గొప్ప శుభవార్త..! ఇకపై నిమిషాల్లోనే గంటల ప్రయాణం.. తెలిస్తే గాల్లో ఎగురుతారు..
కేదార్‌నాథ్ వెళ్లే భక్తులకు శుభవార్త. ఇప్పుడు మీరు అతి తక్కువ సమయంలో హెలికాప్టర్ ద్వారా కేదార్‌నాథ్‌కు చేరుకోగలుగుతారు. IRCTC తన బుకింగ్ ప్రక్రియ ప్రారంభించింది. చార్ ధామ్ యాత్ర తీర్థయాత్రను సులభతరం చేయడానికి IRCTC ద్వారా కేదార్‌నాథ్ హెలికాప్టర్ టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం గొప్ప చొరవతో ముందుకు వస్తోంది.
Updated on: Apr 05, 2023 | 2:38 PM

Kedarnath

అధికారిక వెబ్‌సైట్ నోటీసు ప్రకారం, “2023 శ్రీ కేదార్‌నాథ్ ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ సేవలు IRCTC heliyatra వెబ్‌సైట్ ద్వారా బుక్ చేయబడతాయి . కేదార్‌నాథ్ ధామ్ యాత్రికులకు హెలికాప్టర్ టిక్కెట్ బుకింగ్ సేవను అందించడం కోసం IRCTC ఇటీవల ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UCADA)తో 5 సంవత్సరాల కాలానికి ఎంఓయుపై సంతకం చేసింది.

ఒకవేళ కేదార్‌నాథ్ హెలికాప్టర్ టికెట్ రద్దు చేసుకోవాలనుకున్న వారికి కొన్ని నియమాలు వర్తిస్తాయి. హెలీ సర్వీసును రద్దు చేసినట్లయితే, ప్రయాణికులకు పూర్తి డబ్బు వాపసు ఇవ్వబడుతుంది. ఇందుకోసం ప్రయాణికులు బోర్డింగ్ పాస్‌ను హెలిప్యాడ్‌లోని కౌంటర్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

5 రోజులలోపు టిక్కెట్ బుకింగ్‌ను రద్దు చేసుకున్నందుకు 75% ఛార్జీ ప్రయాణీకుడికి తిరిగి ఇవ్వబడుతుంది. ప్రయాణీకుడు స్లాట్ సమయానికి 1 గంట ముందుగా చేరుకోవడం తప్పనిసరి, సమయానికి ప్రయాణీకులను చేరుకోకపోతే డబ్బు తిరిగి చెల్లించబడదు.

షెడ్యూల్ చేసిన సమయానికి 24 గంటల నుండి 48 గంటల మధ్య రద్దు చేసినందుకు 25% రీఫండ్ చేయబడుతుంది.,24 గంటల ముందు టికెట్ వాపసు/క్యాసిలేషన్ లేదు 48 గంటల నుండి 5 రోజుల మధ్య రద్దు కోసం 50%

అయితే, హెలికాప్టర్ సేవలను బుక్ చేసుకోవడానికి, యాత్రికులు ముందుగా పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను సందర్శించడానికి ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మొబైల్ అప్లికేషన్ ద్వారా మరియు వాట్సాప్ ఫెసిలిటీ ద్వారా కూడా రెసిస్రేషన్ చేయవచ్చు.





























