Watch: ఐడియా అదుర్స్‌..! ఇలాంటి ప్రతిభ మన దేశం దాటి వెళ్లకూడదంటున్న నెటిజన్లు.. అంతలా ఏం చేశాడబ్బా..!!

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. అతని అద్భుతమైన ఆలోచనను ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 24 లక్షల మందికి పైగా వీక్షించారు. 1 లక్షా 16 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై ప్రజలు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు.

Watch: ఐడియా అదుర్స్‌..! ఇలాంటి ప్రతిభ మన దేశం దాటి వెళ్లకూడదంటున్న నెటిజన్లు.. అంతలా ఏం చేశాడబ్బా..!!
Automatic Handpump
Follow us

|

Updated on: Apr 05, 2023 | 3:47 PM

సోషల్ నెట్‌వర్క్‌లో చాలా ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటే..మరికొన్ని వీడియోలు ఔరా అనేట్టుగా ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో దేశీ జుగాడులు చేసే ట్రిక్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తెలివితేటలకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. సాధారణంగా కొన్ని గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం చేతిపంపులు ఏర్పాటు చేస్తారు. చేతితో పంపింగ్ చేస్తే నీరు పైకి వస్తుంది. కానీ, ప్రస్తుత కాలంలో చాలా చేతి పంపులు పనిచేయడం లేదు. ఎక్కడో ఒకటి ఉన్నప్పటికీ గంటల తరబడి పంప్ చేస్తే గానీ, నీరు బయటకు వస్తుంది. అలా నీటిని తోడుకుని బకెట్ నింపుకోవాలంటే..చాలా సమయం పడుతుంది. అదనంగా, చేతులు, భుజాల నొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది. ఇందులో కొన్నింటిని సులభతరం చేసేందుకు ఓ వ్యక్తి కొత్త టెక్నిక్‌ని కనిపెట్టారు. వీడియోలో ఒక వ్యక్తి చేతి పంపుకు కరెంట్ కనెక్ట్ చేసి చేతి నొప్పిని తగ్గించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లోని వైరల్ వీడియోలో ఒక వ్యక్తి దేశీ చేతి పంపును ఆటోమేటిక్ హ్యాండ్ పంప్‌గా మార్చాడు. ఇందుకోసం సైకిల్ చైన్, హ్యాండ్ పంప్, ఎలక్ట్రిక్ స్విచ్, కొన్ని వైర్లను ఉపయోగించాడు. అతని వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్విచ్ ఆన్‌లో చేయగానే పంపు ఆన్ అవుతుంది. కరెంట్ ద్వారా చేతి పంపు పంపులోంచి నీరు రావడం ప్రారంభమవుతుంది. ఈ వీడియోను ఉపేంద్ర ఎన్ వర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. అతని అద్భుతమైన ఆలోచనను ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 24 లక్షల మందికి పైగా వీక్షించారు. 1 లక్షా 16 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై ప్రజలు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ జుగాడ్ దేశం విడిచి వెళ్లకూడదని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇలాంటివి భారతదేశంలోనే సాధ్యమని మరొకరు రాశారు. కరెంట్ ఎక్కువగా ఉచితంగా లభిస్తుంది.. కాబట్టే చేతిపంపుకు కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు అంటూ మరోకరు కామెంట్‌ చేశారు. ఇది ఇండియా ఇక్కడ అన్నీ సాధ్యమేనని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..