Watch Video: క్షణాల్లోనే టీషర్ట్ ను మడత పెట్టేసింది.. ట్విట్టర్ లో షేర్ చేసిన ఆనంద్ మహింద్ర

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఆసక్తికమైన పోస్టులు చేస్తుంటారని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆనంద్ మహింద్ర మరో వీడియోను షేర్ చేశారు.

Watch Video: క్షణాల్లోనే టీషర్ట్ ను మడత పెట్టేసింది.. ట్విట్టర్ లో షేర్ చేసిన ఆనంద్ మహింద్ర
Anand Mahindra
Follow us
Aravind B

|

Updated on: Apr 05, 2023 | 8:32 PM

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఆసక్తికమైన పోస్టులు చేస్తుంటారని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆనంద్ మహింద్ర మరో వీడియోను షేర్ చేశారు. ఓ మహళ టీ షర్ట్ ను సులభంగా, వేగంగా ఓ టీ షర్ట్ ను మడత పెట్టిన వీడియోను పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేయగా ఆ వీడియోను ఏకంగా 1.8 కోట్ల మంది వీక్షించారు. అయితే ఈ వీడియోలో ఓ మహిళ ఒక టీ షర్ట్ పై 1,2,3 అని రాసి ఉన్న చిన్న కార్డులను ఈ టీషర్ట పై పెడుతుంది. ఆ తర్వాత వాటిని తీసేసి క్షణాల్లోనే టీషర్ట్ ను మడతబెడుతుంది.

ఈ వీడియోపై ఆనంద్ మహింద్ర క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది ప్రపంచాన్ని మార్చే విషయం కాకున్న సృజనాత్మకతతో కూడుకున్న పని అని తెలిపారు. పనుల్లో సమయాన్ని ఆదా చేసే ప్రతీది పురోగమిస్తోందంటూ రాసుకొచ్చారు. మ‌హీంద్రాతో ఏకీభ‌వించిన ట్విట్టర్ వినియోగదారులు ఆ మ‌హిళ టెక్నిక్‌ తో టీ షర్ట్ మడతపెట్టడంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అద్భుత‌మైన క్రియేటివిటీ అని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, వీడియోలో ఇది సుల‌భంగా క‌నిపించినప్పటికీ.. ప్రాక్టిక‌ల్‌గా చేయడం అంత సుల‌భ‌ం కాదని మరో యూజర్ కామెంట్ చేశారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..