Jammu Kashmir: ఆర్టికల్ 370 రద్దయ్యాకా జమ్మూ కశ్మీర్ లో ఎంతమంది భూమలు కొన్నారంటే..
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370 రద్దై దాదాపు మూడేళ్లు దాటింది. ప్రస్తుతం అక్కడ ఇతర రాష్టాలకు చెందిన వారు భూములు కూడా కొనుగోలు చేస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370 రద్దై దాదాపు మూడేళ్లు దాటింది. ప్రస్తుతం అక్కడ ఇతర రాష్టాలకు చెందిన వారు భూములు కూడా కొనుగోలు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ లో గత మూడేళ్లలో 185 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు భూములు కొనుగోలు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో వెల్లడించారు. 2020లో ఒకరు, 2021లో 57 మంది, 2022లో 127 మంది భూములు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే లడఖ్ లో మాత్రం ఇంతవరకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎవరూ కూడా భూములు కొనలేదని తెలిపారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం మొత్తం 1559 మల్టీనేషనల్ కంపెనీలతో పాటు భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని పేర్కొన్నారు. కానీ లడఖ్ లో మాత్రం గత మూడేళ్లలో ఏ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టలేదని తేలిపారు.
ఇదిలా ఉండగా 2019లో ఆగస్టు 5 ఆర్టీకల్ 370 రద్దు చేయడంతో జమ్ము కశ్మీర్ కు అప్పటివరకు ఉన్న ప్రత్యేక హోదా తొలగిపోయింది. ఆ తర్వాత ఆ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్ అలాగే లడఖ్ గా విభజించి ఆ రెండింటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో భారతీయులెవరైన అక్కడ భూములు కొనుక్కోవచ్చని.. అలాగే ఎవరైనా అక్కడ పెట్టుబడులు పెట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.