ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న 8వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. మ్యాచ్‌కి ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ టీమ్ కెప్టెన్ సంజూ శామ్సన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు..
RR vs PBKS, IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న 8వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. మ్యాచ్‌కి ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ టీమ్ కెప్టెన్ సంజూ శామ్సన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి దిగనుంది. ఇక టాస్ సందర్భంగా సంజూ శామ్సన్ మాట్లాడుతూ ‘ ఇక్కడ ముందుగానే బౌలింగ్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఆడడాన్ని ఆస్వాదిస్తున్నాను. ఆటగాళ్లు కూడా ఐపీఎల్ పరిస్థితులకు అలవాటు పడ్డారు. మేము అదే దిశగా ముందుకు వెళ్తున్నాము. జైస్వాల్, పరాగ్ వంటి యువ ఆటగాళ్లు అనుభవజ్ఞులైన సీనియర్ క్రికెటర్ల నుంచి చాలా నేర్చుకున్నార’ని అన్నాడు. ఆ తర్వాత పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ‘మైదానంలో మంచు కురుస్తుందని మనందరికీ తెలుసు. మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. నాపై ఎక్కువ ఒత్తిడి లేదు. రాజస్థాన్ టీమ్‌లోని ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వారితో జరిగే ఈ మ్యాచ్‌లో మా ఉత్తమమైన ప్రదర్శన కనబర్చాలని భావిస్తున్నామ’ని చెప్పాడు.
అయితే శిఖర్ ధావన్ తన తొలి మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు కానీ ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించాలంటే అతనే భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. అయితే రాజస్థాన్‌లో రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ఉండడంతో అది గబ్బర్‌కి, అతని జట్టుకు అంత సులువు కాదు. అశ్విన్ ముందు ధావన్ స్ట్రైక్ రేట్ 88 మాత్రమే. అశ్విన్ వేసిన 97 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 14 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక చివరి 5 మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటే.. రాజస్థాన్ 4 సార్లు విజయం సాధించగా.. పంజాబ్ 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.