AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ సమావేశం.. ఏం మాట్లారంటే ?

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం రోజున సమావేశమయ్యారు. జన్‌పథ్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. అధిర్ రంజన్ చౌదరి అలాగే ఇతర ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి వచ్చారు.

Congress: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ సమావేశం.. ఏం మాట్లారంటే ?
Sonia Gandhi
Aravind B
|

Updated on: Sep 06, 2023 | 7:39 AM

Share

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం రోజున సమావేశమయ్యారు. జన్‌పథ్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. అధిర్ రంజన్ చౌదరి అలాగే ఇతర ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఇక సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల జరుగుతాయని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషీ ఇటీవల ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకొని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తమ అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహించింది.

కేంద్ర ప్రభుత్వంపై మరింతగా విమర్శలు చేయాలని యోచిస్తోంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే సమావేశాల ప్రధాన ఉద్దేశం ఏంటి ఇన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడతుందని జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించనుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అలాగే ఈ జమిలి ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది సభ్యులతో కూడినటువంటి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదిరి, గులాబ్ నబీ ఆజాద్ సహా పలువురు నాయకులు ఉన్నారు. అయితే ఈ కమిటీ నుంచి లోక్‌సభ ప్రతిపక్ష నేత అయిన అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2024లో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో నిర్వహించనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ప్రతిపాదిస్తారనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అందుకోసమే హుటాహుటీనా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనుందని అంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ పార్లమెంటరీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలకు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా