AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో పతి దేవుడు బలి.. భర్తకు రెండుసార్లు విషమిచ్చి చంపిన భార్య!

ఓ వ్యక్తి సూసైడ్‌ చేసుకుని మృతి చెందిన నెల తర్వాత అదిరిపోయే ట్విస్ట్ బయటపడింది. అది ఆత్మహత్య కాదని.. సొంత భార్య సుపారీ ఇచ్చిమరీ మర్డర్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి భార్యకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి కుట్రపన్ని హత మార్చినట్లు వెల్లడైంది. ఇందుకోసం సదరు భార్య.. తన భర్తకు రెండుసార్లు విషమిచ్చి దారుణానికి పాల్పడింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బెంగళూరు సౌత్ జిల్లాలోని ఎంకే దొడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మరో పతి దేవుడు బలి.. భర్తకు రెండుసార్లు విషమిచ్చి చంపిన భార్య!
Wife Poisons Husband Twice And Killed
Srilakshmi C
|

Updated on: Jul 26, 2025 | 7:54 PM

Share

బెంగళూరు, జులై 26: ఉలావ్ గ్రామానికి చెందిన లోకేష్‌ (45) ఆ గ్రామానికి మాజీ సర్పంచ్‌. అతడికి రెండు చికెన్‌ దుఖాణాలు ఉన్నాయి. అయితే విషాహారం తిని మే 13న అతడు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ మరునాడు ఎలాగోలా కోలుకుని ప్రాణాలతో ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో జూలై 24న లోకేష్‌ మళ్లీ విష ఆహారం తిన్నాడు. ఈ సారి అతడు మరణించాడు. కారులోపల మృతదేహం, అతడి పక్కన విషం బాటిల్‌ కనిపించడంతో పోలీసులు దీనిని ఆత్మహత్యగానే తొలుత భావించారు. అయితే మృతుడి తల్లి మాత్రం.. తన కోడలు చంద్రకళ, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తన కొడుకుపై విష ప్రయోగం చేసి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన కొడుకుకి విషం ఇచ్చి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తులో చంద్రకళ వద్ద మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులో పనిచేస్తున్న మాండ్యకు చెందిన పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి యోగేష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వెల్లడైంది. లోకేష్‌ను చంపడానికి ఆమె తొలుత మరో వ్యక్తికి రూ.2 లక్షలు సుపారీ ఇచ్చింది. అయితే అతడు డబ్బుతో పరారయ్యాడు. దీంతో ఆమె తన ప్రియుడికే రూ.3.5 లక్షలు సుపారీ ఇచ్చింది. జూన్‌ 23న యోగేష్‌, అతని సహచరులు సూర్య, శివలింగ, చందన్, శాంతరాజు లోకేష్‌ను బెంగళూరులోని కన్వా ఆనకట్ట సమీపంలోని నిర్జన ప్రదేశంలో విషం ఇచ్చారు. దీంతో లోకేష్‌ మృతి చెందడంతో అతడి మృతదేహాన్ని కారులోనే వదిలేసి వెళ్లిపోయారు. అయితే లోకేష్‌ విషం తాగి ఉంటే.. బాటిల్‌ అక్కడే ఉన్నప్పుడు దాని మూత కనిపించకపోవడంతో పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ బీకే ప్రకాశ్‌, సబ్ ఇన్స్‌పెక్టర్‌ సహానా పాటిల్‌ అనుమానించారు. విషం కలిపిన పెరుగు గిన్నె, మిగిలిన విషం బాటిల్‌ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మృతుడికాలికి ఒకే చెప్పు ఉంది. మరోవైపు చంద్రకళ ఫోన్‌ వివరాలు పోలీసులు సేకరించారు. ఆమె యోగేష్‌ అనే వ్యక్తితో పలు మార్లు ఫోన్‌ మాట్లాడినట్లు ఫోన్‌ డేటా చూపింది. ఆధారాలు పెరిగే కొద్దీ పోలీసులకు చంద్రకళపై అనుమానాలు బలపడసాగాయి. దీంతో చంద్రకళ, యోగేష్‌ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నిచడంలో అసలు నిజం కక్కేశారు.

భార్య చంద్రకళ, ఆమె ప్రియుడు యోగేష్‌ వ్యవహారం లోకేష్‌కు తెలియడంతో అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. జూన్‌ 23న లోకేష్ సుంకడకట్టేలోని తన చికెన్ దుకాణం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చంద్రకళ యోగేష్ కు సమాచారం అందించింది. వారం క్రితం కొనుగోలు చేసిన నల్లటి కారులో ముగ్గురు సహచరులతో కలిసి, వారు లోకేష్ ను వెంబడించి, కన్వా డ్యామ్ దగ్గర అతని వాహనాన్ని అడ్డుకున్నారు. లోకేష్ పై దాడి చేసి కారులోకి బలవంతంగా ఎక్కించారు. విషాన్ని అతని గొంతులో పోశారు. అతను మరణించిన తర్వాత వారు మృతదేహాన్ని కారులోనే ఉంచి ఖాళీ విషం సీసాను అతడి శరీరం పక్కనే ఉంచి ఆత్మహత్యగా చిత్రీకరించారని కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. చంద్రకళ,యోగేష్‌లతో పాటు, హత్యలో ప్రమేయం ఉన్న మరో నలుగురు శాంతరాజు, సి ఆనంద్ అలియాస్ సూర్య, జి శివ అలియాస్ శివలింగ, ఆర్ చందన్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.