AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.. కట్ చేస్తే లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.. అసలేం జరిగిందంటే ?

బెంగళూరులోని ఓ లాడ్జిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. లవ్ మ్యారెజ్ చేసుకున్న శశిధర్ అనే వ్యక్తి ఇలా అకస్మాత్తుగా బలవన్మరనానికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటలకలోని విజయపూర్ జిల్లా బసవన్ బాగేవాడిలో శశిధర్ నివాసం ఉంటున్నాడు. అయితే అతను ఓ మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు శశిధర్‌పై బసవన్‌ బాగేవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.. కట్ చేస్తే లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.. అసలేం జరిగిందంటే ?
Death
Aravind B
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 17, 2023 | 7:11 AM

Share

బెంగళూరులోని ఓ లాడ్జిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. లవ్ మ్యారెజ్ చేసుకున్న శశిధర్ అనే వ్యక్తి ఇలా అకస్మాత్తుగా బలవన్మరనానికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటలకలోని విజయపూర్ జిల్లా బసవన్ బాగేవాడిలో శశిధర్ నివాసం ఉంటున్నాడు. అయితే అతను ఓ మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు శశిధర్‌పై బసవన్‌ బాగేవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత శశిధర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే అతడ్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించే క్రమంలోనే శశిధర్ వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత బెంగళూరుకు వచ్చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బెంగళూరులోని కాటన్ టౌన్‌లోని ఓ లాడ్జిలో శశిధర్ అద్దెకు ఉన్నాడు.

అయితే మంగళవారం రాత్రిపూట అతడు తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం లాడ్జి సిబ్బంది అతని గదిలోకి వెళ్లగా ఒక్కసారిగా హడలిపోయారు. అయితే శశిధర్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని.. ఇప్పుడు తన చావుకి తన భార్య తండ్రి, అమ్మ, మామ, అమ్మమ్మ కారణం అని రాసుకొచ్చాడు. అలాగే పెళ్లి జరిగిన తర్వాత తన ప్రియురాలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతోందని శశిధర్ తన మొబైల్ ఫోన్లో స్టేటస్ పెట్టాడు. పోలీసులు నేను చేసిన ఫిర్యాదుని పట్టించుకోలేదని.. నా బాధను అర్థం చేసుకోలేదని… అలాగే పోలీసుల మీద కూడా విచారణ జరగాలని స్టెటస్‌లో చెప్పాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇక్కడ మరో విషయం బయటపడటం కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

విజయపర జిల్లాలోని వాడవాడగి గ్రామానికి చెందిన శశిధర్ తన ప్రియురాలికి చెందిన న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడని.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శశిధర్ తన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌లో ప్రియురాలితో నగ్నంగా ఎంజాయ్ చేస్తుండగా దాన్ని రహస్యంగా వీడియో తీశాడని పోలీస్ అధికారులు తెలిపారు. అలాగే లైంగిక కార్యకలాపాల్లో నిమగ్నమైన ఇద్దరు వ్యక్తుల ఫోటోలు, వీడియోలను.. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన తర్వాత శశిధర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. శశిధర్ మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆ యువతి తల్లిదండ్రులు వారి వివాహాన్ని వ్యతిరేకించారని, ఆ తర్వాత కేసు పెట్టారని తెలిపారు. ఇదంతా జరిగిన తర్వాత శశిధర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.