Kigfisher Beer: అయ్యో బాబోయ్.. 25 కోట్ల విలువైన కింగ్‌ఫిషర్ బీర్లు సీజ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
మైసూరు జిల్లా నంజన్‌గూడలోని యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీ కిగ్‌ఫిషర్ బీర్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే వారు ఉత్పత్తి చేస్తున్నటువంటి బీర్లలో నిషేధిత పదార్థాల అవక్షేపం ఉన్నట్లు తేలింది. కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీర్, శాంపిల్ 7E, 7C బీర్లలో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఆ కంపెనీ వద్దకు వచ్చి బీర్లను పరిశీలించారు. వెంటనే ఆ బీర్ల శాంపిల్స్‌ను పంపించారు. అయితే ఆ బీర్లకు సంబంధించి ఆగస్టు 2 వ తేదిన కెమికల్ రిపోర్టు అందింది.

కింగ్‌ఫిషర్ బీర్.. అంటే తెలియన్ వారు ఉండరు. మద్యం తాగేవారిలో ఎక్కువందికి ఫేవరేట్ ఆల్కహాల్ డ్రింక్ ఇదే. ఈ కింగ్‌ఫిషర్ బీర్ ముఖ్యంగా యువతలో ఆదరిస్తుంటారు. ఎప్పటినుంచో ఈ బీర్ అంటేనే ఓ ప్రత్యేకమైన బ్రాండ్. అయితే ఎంతో ప్రజాధారణ పొందిన ఈ కింగ్‌ఫిషర్ బీర్లను కర్ణాటకలోని మైసూరు ఎక్సేజ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. దాదాపు 25 కోట్ల రూపాయల విలువైనటువంటి 78, 678 బీరు బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని విక్రయిస్తున్న నిందితులపై కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు ఎందుకు ఆ కింగ్‌ఫిషర్ బీర్లను స్వాధీనం చేసుకున్నారు అనేగా మీరు ఆలోచిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఆ బీర్లలో నిషేధిత పదార్థాల అవక్షేపం ఉన్నట్లు గుర్తించారు. అందుకోసమే ఈ కింగ్‌ఫిషర్ బీర్లను స్వాధీనం చేయాల్సి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే మైసూరు జిల్లా నంజన్‌గూడలోని యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీ కిగ్‌ఫిషర్ బీర్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే వారు ఉత్పత్తి చేస్తున్నటువంటి బీర్లలో నిషేధిత పదార్థాల అవక్షేపం ఉన్నట్లు తేలింది. కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీర్, శాంపిల్ 7E, 7C బీర్లలో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఆ కంపెనీ వద్దకు వచ్చి బీర్లను పరిశీలించారు. వెంటనే ఆ బీర్ల శాంపిల్స్‌ను పంపించారు. అయితే ఆ బీర్లకు సంబంధించి ఆగస్టు 2 వ తేదిన కెమికల్ రిపోర్టు అందింది. ఆ రిపోర్టులో నిషేధిత పదార్థాల అవక్షేపాలు ఉనట్లు నిర్ధారణ అయింది. అసలు ఈ బీర్లు మానవులు వినియోగించడానికి వీలు లేదని ఆ నివేదిక పేర్కొంది. వీలనైంత త్వరగా వాటి ఉత్పత్తిని ఆపేయాలని సూచించింది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే అదే సమయానికి మొత్తం 78,868 బాక్సులు అప్పటికే డిపోలకు వెళ్లిపోయాయి.
కర్ణాటలకలోని వివిధ ప్రాంతాల్లో అప్పటికే సరఫరా అయ్యాయి. ఈలోగా బాక్సులన్నీ కూడా ఆగిపోయాయి. మరో ఆందోళనకరం కలిగించే విషయం ఏంటంటే కొన్ని డిపోలు దుకాణాలకు కూడా పంపిణీ చేశారు. అందుకోసమే రిటైల్‌లో కూడా విక్రయించకుండా వాటిని అధికారులు నిలిపివేశారు. అలాగే నాణ్యమైన బీర్లను ఉత్పత్తి చేయనందుకు యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ బీరు మనుషులు తాగడానికి పనికిరాదని.. అంతర్గత రసాయన శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎ. రవి శంకర్ పేర్కొన్నారు. అయితే ఈ బీర్లలో నిషేధిత పదార్థాల అవక్షేపాలు ఉండటంపై మద్యం ప్రియులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి హానికరమైన బీర్లు ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..