Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగానే వేతనాలు.. ఈ రాష్ట్రాలకు మాత్రమే

కేంద్ర ఉద్యోగులకు ఓనం, గణేష్ చతుర్థి పండుగలకు ముందు వారి ఖాతాల్లో జీతం, పెన్షన్ జమ అవుతుంది. పండుగలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎకనామిక్ టైమ్స్ కథనం. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి జరుపుకుంటారు కాబట్టి, కేరళలో ఓనమ్‌ను వైభవంగా జరుపుకుంటారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం తన పదవీ విరమణ చేసినా, సేవలందిస్తున్న ఉద్యోగులకు ముందుగానే పెన్షన్, జీతం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్థిక శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది..

Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగానే వేతనాలు.. ఈ రాష్ట్రాలకు మాత్రమే
Cash
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2023 | 9:08 PM

కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వారికి దుగా పెన్షన్, జీతం అందుతాయి. అయితే ఈ శుభవార్త భారత దేశంలోని అన్ని రాష్ట్రాల ఉద్యోగులు, పెన్షనర్లకు అనుకుంటే పొరపాటే. కేవలం కేరళ, మహారాష్ట్రలకు చెందిన పదవీ విరమణ పొందిన, సేవలందిస్తున్న ఉద్యోగులకు మాత్రమే దీని ప్రయోజనం లభిస్తుంది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కేంద్ర ఉద్యోగులకు ఓనం, గణేష్ చతుర్థి పండుగలకు ముందు వారి ఖాతాల్లో జీతం, పెన్షన్ జమ అవుతుంది.

పండుగలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎకనామిక్ టైమ్స్ కథనం. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి జరుపుకుంటారు కాబట్టి, కేరళలో ఓనమ్‌ను వైభవంగా జరుపుకుంటారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం తన పదవీ విరమణ చేసినా, సేవలందిస్తున్న ఉద్యోగులకు ముందుగానే పెన్షన్, జీతం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్థిక శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

‘ఓనం’ పండుగను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేరళలోని కేంద్ర ఉద్యోగులందరికీ పెన్షన్, జీతం 25 ఆగస్టు 2023 న వారి ఖాతాకు జమ అవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అదే సమయంలో మహారాష్ట్రలోని అన్ని కేంద్ర ఉద్యోగుల జీతం, పెన్షన్ 27 సెప్టెంబర్ 2023న ఖాతాకు బదిలీ చేయబడుతుంది. కేరళలోని సెంట్రల్ పెన్షనర్లందరికీ పీఎఒ ద్వారా పింఛను అందిస్తారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాఖలు తమ ఉద్యోగుల జీతాలను బదిలీ చేయడానికి సమయానికి సిద్ధం కావడానికి కేరళ, మహారాష్ట్రలోని తమ స్థానిక కార్యాలయాలకు తెలియజేయాలని కోరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కేరళ ప్రభుత్వం కూడా ఓనం ముందు ఉద్యోగులకు భారీ కానుకను ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఓనం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.4 వేల బోనస్‌ను ప్రకటించారు. ఇలా పండగల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అంటే కేరళ, మహారాష్ట్రాలకు ఈ శుభవార్త అందనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి