Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి కేసు ఎక్కడా చూసుండరూ.. రూ.6 చిల్లర ఇవ్వనందుకు.. 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న రైల్వే ఉద్యోగి

ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద రాజేశ్ వర్మ అనే వ్యక్తి రైల్వే టికెట్ క్లర్క్‌గా విధులు నిర్వర్తించేవారు. అయితే 1997వ సంవత్సలో ఆగస్టు 30 వ తేదీన విజిలెన్స్ బృందం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్యాసింజర్‌గా పంపి టికెట్ కొనుగోలు చేయించేలా చేశారు. అయితే ఇందులోనే రాజేష్ వర్మ అడ్డంగా బుక్కయ్యారు. అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రయాణికుడు టికెట్ క్లర్క్ అయిన రాజేష్ వర్మకు 500 రూపాయలు ఇచ్చాడు. వాస్తవానికి టికెట్ ధర 214 రూపాయలు మాత్రమే.

ఇలాంటి కేసు ఎక్కడా చూసుండరూ.. రూ.6 చిల్లర ఇవ్వనందుకు.. 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న రైల్వే ఉద్యోగి
Train
Follow us
Aravind B

|

Updated on: Aug 17, 2023 | 5:29 AM

ముంబయిలోని ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కేవలం ఆరు రూపాయల చిల్లర ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్క్‌కు చుక్కలు కనబడ్డాయి. గత 26 ఏళ్లుగా అతనికి ఉపశమనం లభించలేదు. విజలిన్స్ బృందం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వకపోవడం వల్ల అతడు 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత తిరిగి ఉద్యోగం దక్కించుకునేందుకు అతను ఎన్నో ప్రయత్నాలు చేశారు. కోర్టులో అనేకసార్లు అప్పీలుకు వెళ్లారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఒక రూపాయల వల్ల ఒక ఉద్యోగి ఉద్యోగం కోల్పోవడం అంటే చాలా విచిత్రంగా ఉంది కదా. అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ముంబాయిలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనల ఇప్పడు చర్చనీయాంశమవుతోంది. 6 రూపాయల చిల్లర ఇవ్వని కారణంగా రైల్వే క్లర్క్ ఉద్యోగం కోల్పోవడం ఏంటని ఆశ్యర్యపోతున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద రాజేశ్ వర్మ అనే వ్యక్తి రైల్వే టికెట్ క్లర్క్‌గా విధులు నిర్వర్తించేవారు. అయితే 1997వ సంవత్సలో ఆగస్టు 30 వ తేదీన విజిలెన్స్ బృందం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్యాసింజర్‌గా పంపి టికెట్ కొనుగోలు చేయించేలా చేశారు. అయితే ఇందులోనే రాజేష్ వర్మ అడ్డంగా బుక్కయ్యారు. అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రయాణికుడు టికెట్ క్లర్క్ అయిన రాజేష్ వర్మకు 500 రూపాయలు ఇచ్చాడు. వాస్తవానికి టికెట్ ధర 214 రూపాయలు మాత్రమే. ఇక మిగిలిన డబ్బులు 286 రూపాయలు రాజేష్ వర్మ ఆ ప్రయాణికుడికి ఇవ్వాలి. కానీ ఆ ప్రయాణికుడికి వర్మ 280 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. మిగతా చిల్లరు అయిన ఆరు రూపాయలు ఇవ్వలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఆ రోజు వసూళ్లో సుమారు 58 రూపాయల వరకు మిస్ అయ్యాయి. అంతేగాక ఆ క్లర్క్ వెనకాల ఉన్న అల్మారాలో 450 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఇక రాజేష్ వర్మ అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చేశారు. ఇంకేముంది క్రమశిక్షణా చర్యల కింద రాజేష్ వర్మను 2002 సంవత్సరంలో జనవరి 31న విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరికి అతడ్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అయితే ఆ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని రాజేశ్ వర్మ ఖండించారు. ఇందుకోసం వాళ్ల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. రాజేష్ వర్మ కేవలం 6 రూపాయల చిల్లర మాత్రమే ఇవ్వలేకపోయాడని అతని తరఫున న్యాయవాది మిహర్ దేశాయ్ కోర్టుకు తెలియజేశారు. అలాగే అల్మారాను రాజేశ్ వర్మతో సహా అక్కడి ఉద్యోగులందరూ కూడా వినియోగిస్తారని పేర్కొన్నారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేనప్పటికీ కూడా అల్మారాకు ప్రవేశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి సరైన రుజువు ఉందని పేర్కొంది. ఇక చివరికి రాజేష్ వర్మ చేసినటువంటి అప్పీలును తిరస్కరించింది.

గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్..!
గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్..!
అజితే కాదు ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా కార్ రేసరే.. ఎవరంటే?
అజితే కాదు ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా కార్ రేసరే.. ఎవరంటే?
ఏసీ ఎంత వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలంటే.. ఇలా చేయండి
ఏసీ ఎంత వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలంటే.. ఇలా చేయండి
ధన సంపాదన విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
ధన సంపాదన విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేసింది..
వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేసింది..
GT vs PBKS: పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు శుభ్మన్ షాకింగ్ కామెంట్స్
GT vs PBKS: పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు శుభ్మన్ షాకింగ్ కామెంట్స్
స్టేజ్ పైనే పరువు తీసిన ఫ్యాన్స్.. దెబ్బకు బోరున ఏడ్చిన సింగర్..
స్టేజ్ పైనే పరువు తీసిన ఫ్యాన్స్.. దెబ్బకు బోరున ఏడ్చిన సింగర్..
ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో ఏం చేసిందంటే..
ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో ఏం చేసిందంటే..
ఆయుర్వేదం, వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటులో పతంజలి కీలక పాత్ర ఏంటి?
ఆయుర్వేదం, వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటులో పతంజలి కీలక పాత్ర ఏంటి?
హాట్ సమ్మర్‌లో కూల్ కూల్..తక్కువ ధరలో బెస్ట్ ఏసీలు ఇవే..!
హాట్ సమ్మర్‌లో కూల్ కూల్..తక్కువ ధరలో బెస్ట్ ఏసీలు ఇవే..!