భర్త మొదటి భార్య కొడుకుతో సమస్య.. సవతి తల్లి చేసిన పనికి అందరూ షాక్
ఢిల్లీలో చోటుచేసుకున్న ఓ దారణ హత్య కలకలం రేపుతోంది. తన భర్త మొదటి భార్యకు పుట్టిన 11 ఏళ్ల బాలడ్ని హత్య చేసిన ఆరోపణలపై 24 ఏళ్ల మహిళను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు సంబంధించిన విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. భర్త విడాకులు ఇవ్వడానికి తిరస్కరించాడనే కారణంతో అతని 11 ఏళ్ల కొడుకుని హత్య చేసి ఆ తర్వాత అతని మృతదేహాన్ని బెడ్‌బాక్స్‌లో పెట్టింది ఆ మహిళ.

ఢిల్లీలో చోటుచేసుకున్న ఓ దారణ హత్య కలకలం రేపుతోంది. తన భర్త మొదటి భార్యకు పుట్టిన 11 ఏళ్ల బాలడ్ని హత్య చేసిన ఆరోపణలపై 24 ఏళ్ల మహిళను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు సంబంధించిన విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. భర్త విడాకులు ఇవ్వడానికి తిరస్కరించాడనే కారణంతో అతని 11 ఏళ్ల కొడుకుని హత్య చేసి ఆ తర్వాత అతని మృతదేహాన్ని బెడ్‌బాక్స్‌లో పెట్టింది ఆ మహిళ. పెళ్లి చేసుకున్న జితేంద్ర తనకు కొడుకు ఉండటం వల్లే మొదటి భార్య కొడుకు కోసం తనకు విడాకులు ఇవ్వలేదని రెండో భార్య పూజ భావించింది. అందుకోసమే నిద్రిస్తున్న ఆ బాలుడి గొంతు కోసి చంపేసింది. ఈ ఘటనపై ఇదర్‌పురి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంగి. అయితే ఈ హత్య కేసు ఆలస్యంగా వచ్చింది. రాత్రి 8.30 గంటలకు బీఎల్‌కే ఆస్పత్రి నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా బాలుడు మరణించాడని.. అతని మెడ దగ్గర గాయాల గుర్తులు ఉన్నాయని ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు తెలిపారు.
అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే ఆ సమయంలో పూజా కుమారి ఆ చిన్నారి ఉన్న ఇంటికి వెళ్లినటువంటి దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ తర్వాత ఆమె బాలుడు నిద్రిస్తుండగా అతడ్ని హత్య చేసిందని.. అనంతరం బెడ్ కింద ఉండే బెడ్‌బాక్స్‌లో ఉంచినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు 300 వరకు సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆ బాలుడ్ని హత్య చేసిన పూజ.. జితేంద్రను 2019లో ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. అయితే పూజా పెళ్లి సయంలో జితేంద్ర తన ఫస్ట్ భార్య నుంచి విడాకులు తీసుకోలేదు. అయితే పెళ్లి తర్వాత విడాకులు తీసుకుంటానని అతడు పూజకు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత పూజా, జితేంద్ర ఇద్దరూ ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. అయితే మొదటి భార్యకు సంబంధించి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలో జితేంద్ర తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వనని చెప్పాడు. అంతేకాదు పూడ ఇంటిని వదిలేసి మొదటి భార్యతో ఉండటం మొదలుపెట్టాడు. దీంతో పూజ మరింత కోపం పెంచుకుంది. కొడుకు ఉండటం వల్లే మొదటి భార్యను జితేంద్ర విడిచిపెట్టడం లేదని భావించింది. జితేంద్ర ఇంటికి తీసుకెళ్లాలని తన స్నేహితులను కోరింది. ఇందర్‌పురిలోని జితేందర్ ఇంటికి వెళ్లిన సమయంలో అతడి కొడుకు బిట్టు నిద్రపోతున్నాడు. ఆ సమయంలోనే పూజ ఆ బాలుడ్ని హత్య చేసింది. ఆ తర్వాత బెడ్‌బాక్స్‌లో ఉన్న బట్టలు తీసి బాలుడి మృతదేహాన్ని పెట్టి అక్కడి నుంచి పారిపోయింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆమెను పట్టుకుని అరెస్టు చేశారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..