Maha Secret Meetings: శరద్‌పవార్‌తో అజిత్‌పవార్ సీక్రెట్ మీటింగ్.. మళ్లీ వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు
మహారాష్ట్ర కురువృద్ద నేత శరద్‌పవార్ వదులుతున్న గూగ్లీలు అటు ఇండియా కూటమిని , ఇటు ఎన్డీఏ కూటమిని అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే తనకు కేంద్రంలో ఎలాంటి పదవులు అక్కర్లేదని , ఇండియా కూటమి లోనే ఉంటానని శరద్‌పవార్ స్పష్టం చేశారు. మణిపూర్‌పై ప్రధాని మోదీ మౌనం మంచిదికాదని విమర్శించారు.

మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ సీక్రెట్ మీటింగ్ మహా వికాస్ అఘాడి కూటమిలో చిచ్చురేపింది. ఎన్డీఏ కూటమి లోకి శరద్‌పవార్‌ను తీసుకొచ్చేందుకు అజిత్‌పవార్ రాయబారం నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో శరద్‌పవార్‌కు, ఆయన కూతురు సుప్రియా సూలేకు కీలకపదవులు ఇస్తామని అజిత్‌పవార్ ఆఫర్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
శరద్‌పవార్‌కు నీతిఆయోగ్ ఛైర్మన్ పదవి, సుప్రియా సూలేకు కేంద్ర కేబినెట్ మంత్రిపదవి ఇస్తామని అజిత్‌పవార్ ఆఫర్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ సీక్రెట్ మీటింగ్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. శరద్‌పవార్ తన వైఖరిని తేల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శరద్‌పవార్‌ను ఎన్డీఏ కూటమిలో చేరిస్తే అజిత్‌పవార్‌ను మహారాష్ట్ర సీఎం చేస్తామని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు శరద్‌పవార్. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి కలిసే పోటీ చేస్తుందన్నారు.
మా కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు. నేను కాంగ్రెస్,శివసేన నేతలతో ఇవాళ కూడా మాట్లాడాను. నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. మేము కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాం. అయితే అజిత్‌పవార్‌తో తన తండ్రి రహస్యంగా సమావేశం కాలేదన్నారు శరద్‌పవార్ కూతురు సుప్రియా సూలే. ఆ సమావేశంలో రాజకీయాలు మాట్లాడలేదన్నారు. తనకు కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తారన్న వార్తల్లో నిజం లేదన్నారు. నిత్యం తాను సోనియా,రాహుల్‌తో టచ్‌లో ఉన్నట్టు చెప్పారు.
అజిత్‌పవార్‌తో మీటింగ్‌పై శరద్‌పవార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని అన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. శరద్‌పవార్‌కు అజిత్‌పవార్ ఆఫర్ చేసిన పోస్ట్ చాలా చిన్నదన్నారు. తమ కూటమి కలిసే ఉందని శరద్‌పవార్ నేతృత్వం లోనే ముందుకెళ్తామన్నారు.
మొత్తానికి శరద్‌పవార్-అజిత్‌పవార్ సీక్రెట్ మీటింగ్ మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. శరద్‌పవార్ ఎన్డీఏ కూటమి వైపు వెళ్తారా ? లేక ఇండియా కూటమి లోనే కొనసాగుతారా ? త్వరలోనే తేలిపోతుంది.
కాంగ్రెస్ వేసిన ప్రశ్న..
ఇద్దరు నేతలు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని.. ఇలాంటి సమావేశాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోమవారం అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్న ఏంటేంటే..
మాజీ సిఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యుబిటి) మౌత్ పీస్ ‘సామ్నా’ సంపాదకీయంలో “శరద్ పవార్‌ను కలవడానికి అజిత్‌ను పంపడం ద్వారా బిజెపి ‘చాణక్య’ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తుందనే భయం ఉంది. అయితే ఇలాంటి సమావేశాలు శరద్ పవార్ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. ఇది మంచిది కాదన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..