మెడికల్ కాలేజ్‌లో ఆవులు పట్టుకుని విక్రయిస్తున్న సిబ్బంది.. కట్ చేస్తే పెద్ద నెట్‌వర్క్
కేరళలో పశువులను దొంగిలించి అమ్ముకునే కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలుగిస్తోంది. తాజాగా కేరళలోని మెడికల్ కాలేజీ సిబ్బంది వీధిలో వెళ్తున్న పశువులను పట్టుకుని వ్యాపారులకు విక్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ పశువులను అక్రమంగా విక్రయిస్తుండటం వెనుక ఓ సిస్టమేటిక్ నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేరళ మెడికల్ కళశాల చుట్టూ తిరుగుతున్న పశువులను అమ్ముకుంటున్నటువంటి కళాశాల సిబ్బందిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

కేరళలో పశువులను దొంగిలించి అమ్ముకునే కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలుగిస్తోంది. తాజాగా కేరళలోని మెడికల్ కాలేజీ సిబ్బంది వీధిలో వెళ్తున్న పశువులను పట్టుకుని వ్యాపారులకు విక్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ పశువులను అక్రమంగా విక్రయిస్తుండటం వెనుక ఓ సిస్టమేటిక్ నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేరళ మెడికల్ కళశాల చుట్టూ తిరుగుతున్న పశువులను అమ్ముకుంటున్నటువంటి కళాశాల సిబ్బందిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఎర్నాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలోని డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎర్నాకుళం వైద్య కళాశాల క్యాంపస్ పరిసర ప్రాంతాలతో సహా చుట్టుపక్కల చాలమందికి చెందిన ఆవులు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. అయితే ఈ సంఖ్య రోజూ పెరుగుతూ వచ్చింది.
ఒకే ప్రాంతం నుంచి చాలా ఆవులు ఎందుకు తప్పిపోతున్నాయనే అనుమానంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ కెమెరాలు, ఇతర సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొందరు వ్యక్తులు పశువులకు నీరు, గడ్డి ఇతర ఆహారం అందిస్తున్నట్లు సీసీటీవీలో కనిపించింది. అయితే పోలీసులు ఈ కేసును లోతుగా విచారించారు. చివరికి మెడికల్ కళాశాల డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఇక అతడ్ని అదుపులోకి విచారించడంతో కేసు బయటకు వచ్చింది. క్యాంపస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవులకు నీరు, మేత అందించి వాటిని పట్టుకుని వ్యాపారులకు ఇచ్చేవాడ్నని నిందితుడు బిజు మ్యాథ్యూ చెప్పాడు. ఇందుకోసం పశువుల వ్యాపారులతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలిపాడు. అయితే ఇది ఒక్క కళాశాల సిబ్బంది చేసిన దొంగతనం కాదని.. దీనివెనక ఎదైన నెట్‌వర్క్ ఉన్నట్లు సమాచారం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
మెడికల్ కళాశాల ఆవరణలో గడ్డిమైదానం ఉంది. అయితే చాలా ఆవులు మేత కోసం ఇక్కడికి వస్తుంటాయని.. అదే కళాశాలలో ఉద్యోగం చేస్తున్నటువంటి బిజు మ్యాథ్యూ ఆ పశువుల మీద కన్నువేశాడని పోలీసులు పేర్కొన్నారు. దీన్ని పెట్టుబడిగా చేసుకున్న అతను మరికొందరు సాయంతో ఆవులను పట్టుకొని అమ్మేసేవాడని తెలిపారు. మరో ముఖ్య విషయం ఏంటంటే వాళ్ల దగ్గర ఆ పశువులను కొనుక్కున్న వ్యాపారులు వాటిని చంపేసి ఆ మాంసాన్ని విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే గతంలో మెడికల్ కళాశాల డ్రైవర్‌గా పనిచేస్తున్న బిజు మాథ్యూ అదే వ్యాపారంలోకి ఈ మధ్యనే కొత్త వాహనాలను కొన్నాడు. అయితే ఇప్పుడు అతడి వ్యాపారం కేవలం పశువుల దొంగతనాలకి మాత్రమే పరిమితం కాలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..