Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Burger King: బర్గర్ కింగ్ కీలక నిర్ణయం.. టమాటాలు వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటన..

గత కొంతకాలం నుంచి టమాటా ధరలు రికార్డు స్థాయికి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లోనైతే ఏకంగా కిలో 200 రూపాయలు దాటింది. ఇప్పటికీ కూడా సామాన్యులు టమాటాలు కొనేందుకు జంకుతున్నారు. కొంతమందైతే అసలు కూరలలో టమాటాలు వేయడమే మానేశారు. అలాగే మరికొన్ని తినుబండారాలలో నుంచి కూడా టమాటా కనిపించకుండా పోయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో టమాటా ధరలు నెమ్మదిగా తగ్గుతున్న పరిస్థితిలు కనిపిస్తున్నాయి.

Burger King: బర్గర్ కింగ్ కీలక నిర్ణయం.. టమాటాలు వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటన..
Burger King
Follow us
Aravind B

|

Updated on: Aug 17, 2023 | 5:13 AM

గత కొంతకాలం నుంచి టమాటా ధరలు రికార్డు స్థాయికి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లోనైతే ఏకంగా కిలో 200 రూపాయలు దాటింది. ఇప్పటికీ కూడా సామాన్యులు టమాటాలు కొనేందుకు జంకుతున్నారు. కొంతమందైతే అసలు కూరలలో టమాటాలు వేయడమే మానేశారు. అలాగే మరికొన్ని తినుబండారాలలో నుంచి కూడా టమాటా కనిపించకుండా పోయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో టమాటా ధరలు నెమ్మదిగా తగ్గుతున్న పరిస్థితిలు కనిపిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా పూర్తిగా తగ్గాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలామంది టమాటా ధరలు ఎప్పుడెప్పుడు తమ ప్రాంతాల్లో తగ్గుతాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా కూడా బర్గర్స్ లాంటి తినుబండారాల్లో టమాటా మాయమైపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అయితే ఇప్పుడు ఇదే క్రమంలో అటు ఫాస్ట్ ఫుడ్‌చెయిన్ సంస్థ బర్గర్ కింగ్ కూడా తమ ఆహార పదార్థాల పదార్థాల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది. ఇక మరో విషయం ఏంటంటే మెక్‌డోనాల్డ్, సబ్‌వేల వంటి సంస్థలు కూడా ఇప్పటికే ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇక భారత్‌లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా పేరుతో బర్గర్ కింగ్ ఫాస్ట్‌ఫుడ్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే దేశవ్యాప్తంగా 400 స్టోర్లు ఉన్నాయి. అలాగే ఇటీవల టమాటా ధరలు కూడా బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నిర్వహణ కూడా ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా టమాటా సరఫరాల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఆహార పదార్థాల్లో ఈ టమాటాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆహార పదార్థాల్లో నాణ్యత, ప్రమాణాలను కూడా పాటిస్తామని చెప్పింది. మళ్లీ త్వరలోనే తిరిగి వస్తానమని.. దీన్ని కస్టమర్లు అర్థం చేసుకోవాలని కోరింది.

ఇదిలా ఉండగా మరికొన్ని స్టోర్లలో కూడా టమాటాకు వేకేషన్ అవసరం హాస్యరూపంలో బొర్టులు కూడా పెడుతున్నారు. అయితే దేశంలో టమాటా ధరలు భారీగా పెరగడం వల్ల ఆహార పదార్థాలపై ప్రభావం పడింది. దీనివల్ల పలు ఆహార ఉత్పత్తి సంస్థలతో పాటు టమాటాలను దూరం పెట్టేశాయి. చాలా వరకు తాము వినియోగించే ఆహార పదార్థాల్లో టమాటాలను వాడటమే మానేశాయి. ఇదిలా ఉండగా ప్రముఖ ఫుడ్ చెయిన్ సంస్థ అయిన మెక్‌డోనాల్డ్ వీటి వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు జులైలోనే ప్రకటించింది. అదే మార్గంలోని సబ్‌వే.. తమ ఆహార పదార్థాల్లో కూడా టమాటాల వాడకాన్ని వాడేస్తున్నట్లు ఇదివరకే తెలిపింది. టమాటా ధరలు పూర్తిగా తగ్గేవరకు ఇలాంటి ప్రముఖ సంస్థలు టమాటాల వాడకాన్ని నిలిపివేయనున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..