Himachal Pradesh Rains: హిమాచల్‌లో వర్ష భీభత్సం.. 71 మంది మృతి, రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం.. వివరాలివే..
Himachal-Pradesh CM Sukhu: వరదలు స్థానికులకు అంతులేని కష్టాన్నే మిగిల్చాయి. రాష్ట్రంలో వర్షపాతం 50 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. జులై నెలలో వరదలను మరవకముందే రాష్ట్రంలో మరోసారి వర్షాలు ముంచెత్తాయి. తాజాగా వరదలతో రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగిందని సీఎం సుఖ్విందర్ సుక్కు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల విలయం నుంచి కోలుకోవడానికి ఏడాది సమయం పడుతుందని సీఎం సుక్కు అంటున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని..
హిమాచల్ ప్రదేశ్, ఆగస్టు 16: హిమాచల్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. 72 గంటల్లో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ వేల కోట్ల ఆస్తినష్టం జరిగిందని, కేంద్రం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం సుఖ్విందర్ సుక్కు. అయితే ఈ వరదలు స్థానికులకు అంతులేని కష్టాన్నే మిగిల్చాయి. రాష్ట్రంలో వర్షపాతం 50 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. జులై నెలలో వరదలను మరవకముందే రాష్ట్రంలో మరోసారి వర్షాలు ముంచెత్తాయి. తాజాగా వరదలతో రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగిందని సీఎం సుఖ్విందర్ సుక్కు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల విలయం నుంచి కోలుకోవడానికి ఏడాది సమయం పడుతుందని సీఎం సుక్కు అంటున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు.
గడిచిన 3 రోజుల్లోనే 71 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వరదలతో తల్లడిల్లుతున్న ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సిమ్లా లోని సమ్మర్ హిల్స్‌లో వరుసగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. శిథిలాల కింద దాదాపు 30 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఎయిర్‌లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
STORY | Himachal Pradesh rains: Death toll climbs to 71; ‘mountain-like challenge’ before state, says CM Sukhu
READ: https://t.co/dbqx8rLUMK#HimachalPradeshRains #HimachalPradesh
(PTI Photo) pic.twitter.com/yV0bOhghps
— Press Trust of India (@PTI_News) August 16, 2023
కూలిపోతున్న భవనాలు..
#Landslide #landslides #Himachal #HimachalPradesh #HimachalPradeshRains #Himalaya #himachalrains #HimachalDisaster #HimalayaTimes Sarkaghat Landslide, Himachal Pradesh, India🇮🇳 😱😥👇 pic.twitter.com/GUIOPQyMb0
— Dr HARDIP SINGH (@DrHARDIPSINGH) August 15, 2023
వరద భీభత్సం..
Pray for Himachal Pradesh. Till now, 60 deaths reported due to heavy rains, landslides & flash floods.
In the face of such calamity, people are not only ensuring their own safety but also extending their efforts to rescue animals. pic.twitter.com/ZuiloIIDmj
— Anshul Saxena (@AskAnshul) August 15, 2023
మంగళవారం సిమ్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా శిథిలాల కింద జనం చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమ్మర్ హిల్‌లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేస్తోంది. కాంగ్రా డ్యాం ప్రాంతంలో 600 మంది వరదల్లో చిక్కుకున్నారు. హెలికాప్టర్లతో వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమాచల్‌లో 621 రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి . అటు ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. డెహ్రాడూన్ , రిషికేశ్ తదితర ప్రాంతాల్లో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది.