Skincare: వేప ఆకులతో అందం, ఆరోగ్యం.. ఇలా చేశారంటే చర్మ సమస్యలు మాయం-మెరిసే మేనిఛాయ మీ సొంతం..

Skincare: చెడు ఆహారపు ఆలవాట్లు, జీవనశైలి, వాతావారణ కాలుష్యం కారణంగా ప్రస్తుతం కాలంలో చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఇక వీటి నుంచి ఉపశమనం కోసం మార్కెట్‌లో లభించే కాస్మిటక్స్ కోసం అనవసరపు ఖర్చు చేయడంతో పాటు సమస్యలను మరింత తీవ్రతరం చేసుకుంటున్నారు. కానీ అలాంటివారు ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రకృతి సిద్ధంగా లభించే వేప ఆకులను సవ్యంగా ఉపయోగించుకుంటే చాలు అన్ని రకాల సమస్యలు వారం, పది రోజుల్లో మాయమైపోతాయి. ఇందుకోసం వేప ఆకులను ఎలా ఉపయోగించాలి, వాటితో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2023 | 9:13 AM

Skincare: వేప చెట్టులోని ప్రతి భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే నేటికీ చాలా మంది వేప పుల్లలతోనే దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఇంకా వేప ఆకుల్లో కూడా  ఎన్నో ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇవి మొటిమలు, మచ్చలు, ముడతలు, జిడ్డు చర్మం వంటి పలు చర్మ సమస్యలను దూరం చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.

1 / 5
మొటిమలకు చెక్: వేపలోని యాంటీబాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను నయం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ క్రమంలో మీరు వేప ఆకుల పేస్ట్‌ని ముఖంపై ఫేస్ మాస్క్‌లా ఉపయోగిస్తే చాలు.

2 / 5
పిగ్మెంటేషన్: పిగ్మెంటేషన్, మచ్చలను నివారంచిడానికి కూడా మీరు వేప ఆకులను ఉపయోగించవచ్చు. వేపలోని విటమిన్ సి చర్మం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

3 / 5
డార్క్ సర్కిల్స్: వేపలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మంపై డార్క్ సర్కిల్స్ నివారణకు కూడా ఉపయోగపడతాయి. ఇందుకోసం మీరు వేప ఆకుల పేస్ట్‌ను చర్మంపై 10 నిమిషాలు అప్లై చేయాలి, తర్వాత సాధారణ నీటితో కడిగి వేయండి. ఇలా వరాంలో రెండు సార్లు చేస్తే చాలు, సమస్య దూరం అవుతుంది.

4 / 5
మాయిశ్చరైజర్: వేప చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. వేప ఆకులు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, పోషణను ఇచ్చి ఎండ నుంచి రక్షిస్తాయి. అలాగే  వేపలోని కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీ ఏజింగ్ గుణాలు మీ చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి.

5 / 5
Follow us