నందిత శ్వేత.. అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభం నుండీ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేస్తూ వచ్చింది ఈ అమ్మడు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈమెను బాగానే ఓన్ చేసుకున్నారు అంటే ఈమె ఎంపిక చేసుకునే కంటెంట్ బేస్డ్ సినిమాలే అని చెప్పాలి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బ్లఫ్ మాస్టర్’ ప్రేమ కథా చిత్రం 2′ ‘కల్కి’ ‘కపటదారి’ ‘అక్షర’ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది.