Daksha: శరత్ బాబు కొడుకు హీరోగా.. దివంగత నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా నటిస్తున్న సినిమా దక్ష. అను, అఖిల్, రియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ప్రముఖ దర్శకుడు దశరథ్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ ఎక్స్ చైర్ మాన్ ఉప్పల శ్రీనివాస్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.