- Telugu News Photo Gallery Cinema photos Samantha new photos in vijay devarakonda Kushi movie promotions Telugu Actress Photos
Samantha Ruth Prabhu: ఖుషి ప్రమోషన్స్‌లో సందడి చేసిన సమంతా.. విజయ్ ఆశలన్నీ ‘ఖుషి’ పైనే..
ఒకటి రెండు కాదు.. తనకు తనే ఏడాది సెలవు ప్రకటించేసుకున్నారు సమంత. మరి ఇప్పుడు ఖుషి సినిమా ప్రమోషన్‌కు వస్తారా..? విడుదలకు సిద్ధంగా ఉన్న ఖుషీకి స్యామ్ సపోర్ట్ ఉంటుందా లేదా..? ఈ చిత్ర ప్రమోషన్‌లో సమంత పాత్ర ఎంత..? సమంత ప్రస్తుతం హాలీడేలో ఉన్నారు. ఈమె కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని ఫిక్సైపోయారు. తన ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు స్యామ్.
Anil kumar poka | Edited By: Ravi Kiran
Updated on: Aug 17, 2023 | 9:27 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీదనున్నాడు. ఇప్పుడు ఆశలన్నీ ఖుషి సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 1న ఖుషి మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే ఆరోగ్యం కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఖుషీకి స్యామ్ సపోర్ట్ ఉంటుందా లేదా..?

ఈ చిత్ర ప్రమోషన్‌లో సమంత పాత్ర ఎంత..? సమంత ప్రస్తుతం హాలీడేలో ఉన్నారు. ఈమె కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని ఫిక్సైపోయారు. తన ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు స్యామ్.

మయోసైటిస్ కారణంగా అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు సమంత. అందుకే ఒప్పుకున్న ఖుషీ, సిటాడెల్‌లను పూర్తి చేసారు సమంత.

ఖుషీ మూవీ ప్రమోషన్స్ కోసం సమంత స్పెషల్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఓ కామన్ ఇంటర్వ్యూతో పాటు.. మ్యూజికల్ ఈవెంట్‌కు మాత్రమే వస్తానని మేకర్స్‌కు ముందుగానే చెప్పినట్లు తెలుస్తుంది.

ఆల్రెడీ ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ కు హాజరైన సమంత అలాగే ఓ ఇంటర్వ్యూకు రానున్నారు స్యామ్. ఖుషీకి ఈమె వైపు నుంచి నో ప్రమోషన్స్ ఇంక.

గతంలో యశోద, శాకుంతలం సినిమాలకు కూడా అరకొర ప్రమోషన్స్ చేసారు ఈ బ్యూటీ. ఖుషీకి ఇదే అప్లై చేస్తున్నారీమె. మొత్తానికి మరో ఏడాది వరకు సమంత సినిమా ఈవెంట్స్‌కు బాగానే డిస్టేన్స్ మెయింటేన్ చేయబోతున్నారు.





























