Mancherial: విడాకులు ఇవ్వలేదని భార్య పాలిట కాలయముడైన భర్త.. 10 లక్షల సుపారీ ఇచ్చి మరీ..
Mancherial: భార్య విడాకులు ఇస్తేనే మరో యువతిని చేసుకునే పరిస్థితి ఉండటంతో ఇక లాభం లేదనుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భార్యను మట్టుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు భర్త. చేతికి రక్తం అంటకుండా 10 లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్ వాడకు చెందిన బత్తిని శరణ్య, రాళ్లపేట కు చెందిన సయ్యద్ జియా ఉల్ హక్ 2009 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సయ్యద్ జియా ఉల్ హక్ అలియాస్ సద్దు.. సిఐఎస్ఎఫ్..

మంచిర్యాల, ఆగస్టు 16: కులమతాలు వేరైనా పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే వాళ్లిద్దరి మధ్యకు మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో గొడవలు పెరిగాయి. భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం.. విడాకులు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టడంతో భర్త నుంచి దూరంగా వచ్చేసింది ఆ యువతి. భార్య విడాకులు ఇస్తేనే మరో యువతిని చేసుకునే పరిస్థితి ఉండటంతో ఇక లాభం లేదనుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భార్యను మట్టుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు భర్త. చేతికి రక్తం అంటకుండా 10 లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్ వాడకు చెందిన బత్తిని శరణ్య, రాళ్లపేటకు చెందిన సయ్యద్ జియా ఉల్ హక్ 2009 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
అయితే సయ్యద్ జియా ఉల్ హక్ అలియాస్ సద్దు.. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ.. విధుల్లో భాగంగా పక్క రాష్ట్రం వెళ్లగా కాంచన్ అనే మరో యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబదానికి దారి తీసింది. ఈ విషయం భార్య శరణ్యకు తెలియడంతో పలు మార్లు నిలదీసింది. అయితే ఆ యువతే తన భార్య అని శరణ్యతో తనకు ఎలాంటి సంబందం లేదని విడాకులు ఇచ్చేయ్యంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు సద్దు. భర్త జియా ఉల్ హక్ వేధింపులు తట్టుకోలేక శరణ్య తన 9 ఏళ్ల కూతురు మనస్వికతో కలిసితో పుట్టింటికి వచ్చేసింది. ఇదే సమయంలో పలు మార్లు విడాకుల విషయంలో ఒత్తిడికి గురి చేసిన భర్త జియా ఉల్.. శరణ్యను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా చేశాడు. అయినా శరణ్య వెనక్కి తగ్గకపోవడంతో అన్నంత పని చేశాడు జియా ఉల్ హక్.




శరణ్యను చంపేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఎనిమిది మంది ముఠాను సంప్రదించడంతో తొమ్మిది లక్ష రూపాయలకు ఢీల్ సెట్ అయింది. సుఫారి గ్యాంగ్‌తో ఒప్పందం ప్రకారం అడ్వాన్సుగా లక్షా యాభై వేలు చెల్లించడంతో చంద్రగిరి సాయికుమార్, దారంగుల రాజ్ కుమార్, శివ, పల్లికొండ అనిల్ , వేముల సాయి , మంచర్ల రవితేజ, MD అమెర్ గౌరీ, పల్లికొండ శివ కృష్ణ అనే నిందితులు పక్క స్కెచ్ ప్రకారం కాపుకాసి శరణ్యను హత్య చేశారు. హత్యకు పాల్పడ్డ నిందితులు జల్సాలకు అలవాటు పడి గంజాయి మత్తులో అత్యంత కిరాతకంగా ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు పోలీసులు.