ప్రపంచంలో అత్యధిక గోల్డ్ స్టాక్ ఉన్న టాప్ 10 దేశాలు..! ఈ జాబితాలో భారత్ ఉందా?

చారిత్రక నేపథ్యం ఉన్న పర్యాటకులకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్, ఫ్రాన్స్‌లో 2,436.81 టన్నుల బంగారు నిల్వ ఉంది. దీనితో దేశం పశ్చిమ ఐరోపాలో మూడవ అతిపెద్ద బంగారు నిల్వలున్న దేశంగా, ప్రపంచ వ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది. 14 దేశాలతో తన సరిహద్దులను పంచుకుంటూ, అత్యధిక జనాభా కలిగిన రెండవ దేశం చైనా. కమ్యూనిస్ట్ దేశం చైనా కూడా అత్యధిక బంగారు నిల్వ కలిగిన 6వ అతిపెద్ద దేశంగా నిలిచింది.

ప్రపంచంలో అత్యధిక గోల్డ్ స్టాక్ ఉన్న టాప్ 10 దేశాలు..! ఈ జాబితాలో భారత్ ఉందా?
Gold
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 16, 2023 | 7:32 PM

ప్రపంచంలో ఎంత బంగారం నిల్వలు ఉన్నాయో దాని ఆధారంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో లెక్కిస్తారు. జూన్ 2023 చివరి నాటికి అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాల సమాచారం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.. ఆ పది దేశాల్లో మన భారత దేశం ఉందా..? లేదా..? ఉంటే భారత్ స్థానం ఎంతో తెలుసా..?

1. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా:

ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా ఉన్న అమెరికాలో 8,133.46 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీంతో దేశంలోనే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశంగా గుర్తింపు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్ అమెరికాకు దక్కింది.. ఇది కాకుండా, ఉత్తర అమెరికా దేశాలలో టాప్ 10 బంగారు నిల్వలను కలిగి ఉన్న ఏకైక దేశం ఇది.

ఇవి కూడా చదవండి

2. జర్మనీ:

పశ్చిమ ఐరోపాలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ఉన్న జర్మనీలో 3,354.89 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీంతో జర్మనీ రెండో అతిపెద్ద బంగారు నిల్వ కలిగిన దేశంగా నిలిచింది.

3. ఇటలీ:

పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానంగా పేరుగాంచిన ఇటలీ పర్యాటకం పరంగానే కాకుండా బంగారు నిల్వల విషయంలో కూడా చాలా దేశాల కంటే ముందుంది. ఇటలీలో 2,451.84 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీనితో, దేశం పశ్చిమ ఐరోపాలో రెండవ అత్యధిక బంగారు నిల్వలను కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూడవ అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉంది.

4. ఫ్రాన్స్;

చారిత్రక నేపథ్యం ఉన్న పర్యాటకులకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్, ఫ్రాన్స్‌లో 2,436.81 టన్నుల బంగారు నిల్వ ఉంది. దీనితో దేశం పశ్చిమ ఐరోపాలో మూడవ అతిపెద్ద బంగారు నిల్వలున్న దేశంగా, ప్రపంచ వ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది.

5. రష్యన్ ఫెడరేషన్:

తూర్పు ఐరోపాలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న రష్యాలో 2,326.52 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం చేసినా బంగారం నిల్వలో వెనుకంజ వేయలేదు.

6. చైనా:

పొరుగున ఉన్న చైనా వద్ద 2,068.36 టన్నుల బంగారం నిల్వ ఉంది. 14 దేశాలతో తన సరిహద్దులను పంచుకుంటూ, అత్యధిక జనాభా కలిగిన రెండవ దేశం కూడా చైనా. కమ్యూనిస్ట్ దేశం చైనా 6వ అతిపెద్ద బంగారు నిల్వ కలిగిన దేశం.

7. స్విట్జర్లాండ్:

పశ్చిమ ఐరోపాలో అత్యధిక ఆదాయం కలిగిన దేశంగా ఉన్న స్విట్జర్లాండ్‌లో 1,040.00 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ దేశం ప్రధాన ఆదాయ వనరు బ్యాంకింగ్ & ఫైనాన్స్.

8. జపాన్

జపాన్ చిన్న ద్వీప దేశమే అయినా సంపద విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు. జపాన్‌లో 846 టన్నుల బంగారం నిల్వ ఉంది. దీంతో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది.

9. భారతదేశం:

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో 794.62 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే, టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం.

10. నెదర్లాండ్స్:

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉన్న నెదర్లాండ్/హాలండ్ 612.45 టన్నుల బంగారు నిల్వలను కలిగి ఉంది. టాప్ 10 జాబితాలో 10వ స్థానంలో ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు