Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Apple: వాటర్ యాపిల్ గురించి మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు..! ఇకపై అస్సలు విడిచి పెట్టరు..

సాధారణ యాపిల్ మాదిరిగానే ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ యాపిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా, జలుబు దగ్గు నుండి దూరంగా ఉంచుతుంది. ఇంకా అనేక ప్రమాదకరమైన వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పండును తప్పక తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మలబద్ధకం, అసిడిటీ ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా వాటర్‌ యాపిల్ తినాలి. ఎందుకంటే

Water Apple: వాటర్ యాపిల్ గురించి మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు..! ఇకపై అస్సలు విడిచి పెట్టరు..
Water Apple
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 16, 2023 | 7:10 PM

అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవిగానే ఉంటాయి. అటువంటి పండ్లలో వాటర్ యాపిల్ కూడా ఒకటి. ఈ వాటర్ ఆపిల్ ను రోజ్ యాపిల్, గులాబ్ జామూన్ అని కూడా పిలుస్తారు. అయితే, ఈ పండు గురించి ఎక్కువ మందికి పెద్దగా తెలియదు. కాని ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటర్‌ యాపిల్‌ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఈ పండు తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. వాటర్‌ యాపిల్‌ రుచిలో కొద్దిగా తీపిగా ఉంటుంది. కానీ, ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాదు.. వాటర్ యాపిల్‌తో మలబద్ధకం సమస్య నిమిషాల్లో పోతుంది. చర్మం మెరుస్తుంది. వాటర్‌ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

వాటర్‌ యాపిల్‌లో ఉండే క్యాల్షియం, పొటాషియం దంతాలను బలపరుస్తుంది. వికారం, బలహీనంగా ఉన్నవారికి ఈ పండు రామబాణం లాంటిదని చెబుతారు. వాటర్ యాపిల్ లో పొటాషియం చాలా మంచిది. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అధిక రక్తపోటు సమస్యను కూడా అధిగమించవచ్చు. మీ కంటి చూపు బలహీనంగా ఉంటే, వాటర్‌ ఆపిల్ తినడం మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ సితో పాటు ఎ కూడా ఉంటుంది. దీని వల్ల కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే వాటర్‌ యాపిల్ ఎముకలను బలోపేతం చేయడంలో కూడా మేలు చేస్తుంది.

సాధారణ యాపిల్ మాదిరిగానే ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ యాపిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా, జలుబు దగ్గు నుండి దూరంగా ఉంచుతుంది. ఇంకా అనేక ప్రమాదకరమైన వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పండును తప్పక తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

మలబద్ధకం (అసిడిటీ) ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా వాటర్‌ యాపిల్ తినాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని బలపరుస్తుంది. ఈ పండులో ఉండే పీచు మలబద్దకాన్ని తొలగించడమే కాకుండా పొట్టలోని అజీర్ణం, మలబద్ధకం మొదలైనవాటిని తొలగించి జీర్ణక్రియ ప్రక్రియను ఆరోగ్యవంతంగా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..