Hair Care Tips: జుట్టు రంగు కోసం ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు.. పెరట్లో పెరిగే ఈ ఆకులు చాలు.. శాశ్వత పరిష్కారం..!

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. చల్లారిన తర్వాత అందులో కరివేపాకు, వేప ఆకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మీ హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంది. జుట్టు మీద హెయిర్ మాస్క్ వేసుకునే ముందు, జుట్టును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి. తర్వాత హెయిర్ మాస్క్ వేసుకుని గంటసేపు అలాగే ఉంచి జుట్టును కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు సమస్య పోతుంది.

Hair Care Tips: జుట్టు రంగు కోసం ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు.. పెరట్లో పెరిగే ఈ ఆకులు చాలు.. శాశ్వత పరిష్కారం..!
Hair Care Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 16, 2023 | 4:51 PM

మనం తినే ఆహారం జుట్టు మీద చాలా ప్రభావం చూపుతుంది. చెడు ఆహారం వల్ల జుట్టు రాలడం, జుట్టు అకాల నెరసిపోవడం, పొడి జుట్టు, చుండ్రు వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం అనేది ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న సాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు సమస్యను పరిష్కరించడానికి మనం మార్కెట్‌లో లభించే షాంపూ, కండీషనర్, ఆయిల్, కలర్ మొదలైన వాటిని ఉపయోగిస్తాము. కానీ వీటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఈ కెమికల్స్ కి బదులు హోం రెమెడీస్ వాడితే సమస్యకు సహజసిద్ధమైన పరిష్కారం లభిస్తుంది. మీ పెరట్లో పెరిగే కరివేపాకు మీ కేశాలను నల్లగా మారుస్తుందని మీకు తెలుసా..?

అధిక ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలు మీ జుట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం, చిన్నతనంలోనే తెల్లజుట్టు వంటి సమస్యలను ఎదురవుతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయండి.. ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నించండి. రసాయనాలు అధికంగా ఉండే షాంపులు, కండీషనర్స్‌కు దూరంగా ఉండండి. ఇంట్లో మీకు అందుబాటులో ఉండే పదార్థాలతో మీ జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. వాటిని ముందుగా తెలుసుకోండి..

మెలనిన్ లేకపోవడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. కరివేపాకు జుట్టులో మెలనిన్ లోపాన్ని తొలగిస్తుంది. కరివేపాకు హెయిర్‌ మాస్క్‌ మీకు అద్భుత ఫలితానిస్తుంది. అదే ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

కరివేపాకులో కాల్షియం, ఐరన్,ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అధికంగా ఉంటాయి. కరివేపాకులో విటమిన్ సి, ఎ కూడా ఉంటాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇక, జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టే కరివేపాకుతో అద్భుత హెయిర్‌ మాస్క్‌ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

ఈ హెయిర్ మాస్క్ కోసం కావాల్సినవి…  కరివేపాకు, కొబ్బరి నూనె, వేప ఆకులు, విటమిన్ ఇ క్యాప్సూల్స్, పెరుగు అవసరం. జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టే అద్భుత హెయిర్‌ మాస్క్‌ ఇంట్లోనే తయారు చేసుకోవటానికి కావాల్సినవి.. కరివేపాకు, కొబ్బరి నూనె, వేప ఆకులు, విటమిన్ ఇ క్యాప్సూల్స్, పెరుగు అవసరం.

కరివేపాకు, వేప ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవాలి. మరో పాత్రలో కొబ్బరి నూనె, విటమిన్ ఇ క్యాప్సూల్, పెరుగు వేసి సరిగ్గా మిక్స్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. చల్లారిన తర్వాత అందులో కరివేపాకు, వేప ఆకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మీ హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంది.

జుట్టు మీద హెయిర్ మాస్క్ వేసుకునే ముందు, జుట్టును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి. తర్వాత హెయిర్ మాస్క్ వేసుకుని గంటసేపు అలాగే ఉంచి జుట్టును కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు సమస్య పోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..