AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: చికెన్‌ ఆర్డర్‌ చేస్తే ఎలుక మాంసాన్ని సప్లై చేసిన రెస్టారెంట్‌..! కంగుతిన్న కస్టమర్‌ ఏం చేశాడంటే..

చికెన్‌తో పాటు అనుమానాస్పద మాంసం ముక్క కూడా కనిపించింది. దాంతో షాక్‌ తిన్న సదరు బాధితుడు అది ఎలుక మాంసం అని గుర్తించి వెంటనే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు హోటల్ మేనేజర్, చెఫ్, సప్లై చేసిన వారిపై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ మేనేజర్, చెఫ్ తమకు వడ్డించిన చికెన్ డిష్‌లో చనిపోయిన ఎలుకను కూడా వడ్డించారని కస్టమర్ ఆరోపించారు. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Viral News: చికెన్‌ ఆర్డర్‌ చేస్తే ఎలుక మాంసాన్ని సప్లై చేసిన రెస్టారెంట్‌..! కంగుతిన్న కస్టమర్‌ ఏం చేశాడంటే..
Dead Rat
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2023 | 2:37 PM

Share

మీరు చికెన్ ఆర్డర్ చేస్తే ఎలుక మాంసాన్ని ఇచ్చే రెస్టారెంట్ ఒకటి ఉందని మీకు తెలుసా..? అవును, సాధారణంగా హోటళ్లలో కొన్నిసార్లు ఆహార సరఫరాలో తేడా వస్తుంది. అప్పుడప్పుడు పొరపాటున.. మనం అడిగిన దానికి భిన్నంగా మరో ఆహారాన్ని సప్లై చేస్తుంటారు హోటల్‌ సిబ్బంది. మనకు సప్లై చేసే ఫుడ్‌లో కొన్నిసార్లు పురుగులు, బొద్దింకలు, బల్లి తదితరాలు కూడా కనిపిస్తుంటాయి. అలాంటి ఘటనలు ఎదురైనప్పుడు కస్టమర్లు కంగుతిన్న వార్తలు కూడా అనేకం చూశాం. చికెన్ లేదా మటన్ మీల్స్‌లో ఇతర మాంసాలను కలుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ముంబైలోని ఓ ప్రతిష్టాత్మక రెస్టారెంట్‌లో చికెన్ ఆర్డర్ చేసిన వినియోగదారుడికి ఎలుక మాంసం సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాణిజ్య నగరమైన ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఫ్యామిలీతో కలిసి పార్టీకి వెళ్లిన కస్టమర్ ఒకరు థాలీ, చికెన్ ఆర్డర్ చేశాడు.. అయితే రెస్టారెంట్ సిబ్బంది అతనికి చికెన్ కు బదులు ఎలుక మాంసాన్ని సరఫరా చేశారు. చికెన్‌లో కనిపించిన ఎలుకను చూసి కస్టమర్ కంగుతిన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ముంబైలోని బాంద్రా ప్రాంతం పాలి హిల్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై అనురాగ్ సింగ్ అనే కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను తన ఫ్యామిలీతో కలిసి హోటల్ కి వచ్చానని… బ్రెడ్‌తో చికెన్, మటన్ థాలీ ప్లేటర్ ఆర్డర్ చేసినట్టుగా చెప్పాడు. అయితే, తనకు సప్లై చేసిన ఫుడ్ లో చికెన్‌తో పాటు అనుమానాస్పద మాంసం ముక్క కూడా కనిపించిందని చెప్పాడు. అదేంటని చూడగా.. చనిపోయిన ఎలుక అని తెలిసింది.  దాంతో సదరు బాధితుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తినే ఆహారంలో చనిపోయిన ఎలుకను గుర్తించిన అతడు  వెంటనే  హోటల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు హోటల్ మేనేజర్, చెఫ్, సప్లై చేసిన వారిపై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ మేనేజర్, చెఫ్ తమకు వడ్డించిన చికెన్ డిష్‌లో చనిపోయిన ఎలుకను కూడా వడ్డించారని కస్టమర్ ఆరోపించారు. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదుదారు అనురాగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, అతను తన స్నేహితుడితో కలిసి భోజనం చేసేందుకు బాంద్రా వెస్ట్‌లోని పాలి హిల్‌లోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. అతను బ్రెడ్‌తో చికెన్, మటన్ థాలీ ఆర్డర్ చేసినట్టుగా చెప్పాడు. తినేటప్పుడు మాంసం ముక్క రుచి మరోలా ఉండటంతో అనుమానం వచ్చిందిని.. నిశితంగా పరిశీలించగా అది చిన్న ఎలుక లాంటి మాంసం ముక్క అని గమనించాడు. ఇదే విషయమై అనురాగ్‌సింగ్‌ రెస్టారెంట్‌ మేనేజర్‌ని ప్రశ్నించగా.. అతను వెటకారంగా సమాధానం ఇచ్చాడని ఆరోపించాడు.. దీంతో ఆగ్రహం చెందిన కస్టమర్ అనురాగ్ సింగ్ బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రెస్టారెంట్ మేనేజర్ వివియన్ ఆల్బర్ట్ షికావర్‌తో పాటు ఆ సమయంలో హోటల్‌లో ఉన్న చెఫ్, చికెన్ సప్లయర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..