Tripura: త్రిపురలో దారుణం.. జగన్నాథ రథ యాత్రలో కరెంట్ షాక్‌తో ఏడుగురు మృతి
త్రిపురలో విషాదం చోటుచేసుకుంది. ఉనకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్ వద్ద ఇనుముతో చేసిన జగాన్నాథరథం హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో.. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. కరెంట్ షాక్‌కు గురై రథంపైనున్న ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
త్రిపురలో విషాదం చోటుచేసుకుంది. ఉనకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్ వద్ద ఇనుముతో చేసిన జగన్నాథ రథం హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో.. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. కరెంట్ షాక్‌కు గురై రథంపైనున్న ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 18 మందికి గాయాలు కాగా ఉనకోటి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రథానికి విద్యుత్ తీగ ఎలా తగిలిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రథయాత్ర పండగ జూన్ 20న ప్రారంభమవ్వగా.. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతతో కలిసి.. రథాయాత్ర జరిగిన ఓ వారం తర్వాత తిరిగి వారి నివాసానికి వస్తారు. ఈ ఉత్సవాల ముగింపులో భాగమైన ‘ఉల్టా రథ్’ ఊరేగింపులో జగన్నాథ ఆలయానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అనేక మంది భక్తులు ఆ రథాన్ని లాగుతున్నారని స్పాట్‌లో ఉన్నవారు చెప్పారు. ఈ ప్రయాదంలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారనిదీనిపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి అగర్తల నుంచి కుమార్‌ఘాట్‌కు వెళ్లారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం