05 January 2025

యానిమల్ సినిమా  ఒప్పుకోవడానికి కారణం అదే.. త్రిప్తి డిమ్రి..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం  బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్లలో త్రిప్తి డిమ్రి ఒకరు. ఇప్పుడు ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. 

దాదాపు పదేళ్ల క్రితమే సినీరంగంలోకి నటిగా అడుగుపెట్టిన త్రిప్తికి ఇటీవలే సరైన బ్రేక్ వచ్చింది. యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. 

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించింది. 

ఇందులో జోయా పాత్రలో కనిపించి యువ హృదయాలను కొల్లగొట్టింది త్రిప్తి డిమ్రి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడింది.

ఆరంభంలో అవకాశాల్లేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని గుర్తు చేసుకుంది. తన కెరిర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ యానిమల్. 

యానిమల్ మూవీని స్త్రీ ద్వేష చిత్రంగా తానేప్పుడూ చూడలేదని.. సినిమాలకు అలాంటి ట్యాగ్స్ ఇవ్వను అని చెప్పుకొచ్చింది త్రిప్తి డిమ్రి. 

కోలా, బుల్బుల్ సినిమాలు చేస్తున్నప్పుడు వాటిని స్త్రీవాద చిత్రాలుగా భావించలేదని.. ఆయా కథల్లోని పాత్రకు కనెక్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. 

మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. దయ, సానుభూతి కనిపించాలని సందీప్ చెప్పాడని.. అది సవాలుగా అనిపించి ఒకే చెప్పానని తెలిపింది.