Comedian AVS Daughter: బతికించుకోవడానికి నా కాలేయం ఇచ్చాను.. చివరకు నా చేతిలోనే రక్తం కక్కుకుని.. ఏవీఎస్ కూతురు..
తెలుగు సినీ ప్రియులకు కమెడియన్ ఏవీఎస్ సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన.. మిస్టర్ పెళ్లాం సినిమాతో నటుడిగా మారారు
కమెడియన్ ఏవీఎస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో మొదటి సినిమాతోనే నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం వంటి చిత్రాల్లో నటించాడు. తెలుగులో దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. కానీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పుడే 2013లో మరణించారు. ఏవీఎస్ కూతురు, అల్లుడు సైతం నటీనటులే అన్న సంగతి చాలా మందికి తెలియదు.
తాజాగా ఏవీఎస్ కూతురు శాంతి, అల్లుడు చింటూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే శాంతి మాట్లాడుతూ తన తండ్రి గురించి చెప్పుకొచ్చింది. తన తండ్రి 57 ఏళ్ల వయసులో మరణించాడని.. అమ్మ గతేడాది నవంబర్ లో కన్నుమూసిందని చెప్పుకొచ్చింది. నిరంతరం షూటింగ్ లోనే ఉండడం నిద్రను పట్టించుకోకపోవడం వల్లే తన తండ్రి ఆరోగ్యం దెబ్బతిని మరణించాడని చెప్పుకొచ్చింది. కానీ అందరూ తాగడం వల్లే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని అంటారని తెలిపింది. 2008లో తన తండ్రికి కాలేయం పాడైందని.. రక్తపు వాంతులు చేసుకున్నాడని.. ఆ సమయంలో తనకు కాలేయం మార్పిడి చేయాలని డాక్టర్స్ చెప్పారని గుర్తుచేసుకుంది.
‘నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యాను.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్ కాదన్నారు. దాత దొరకాలంటే ఏడాది పడుతుందని అన్నారు. అప్పుడే నాన్న జ్ఞాపకశక్తి కోల్పోయారు. ఎవరిని గుర్తుపట్టలేదు. నాన్న బతకడానికి ఒక్క శాతమే ఛాన్స్ ఉందన్నారు. ఆయనను ఐసీయులో ఉంచి మమ్మల్ని వెళ్లిపోమన్నారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడికి దండం పెట్టుకున్నాం. ఆ తర్వాత రోజు ఉదయమే నాన్న కాల్ చేశాడు. ఆయనకు జ్ఞాపకశక్తి ఎలా తిరిగి వచ్చిందో అర్థం కాలేదు. 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో నా కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యాను. అందుకు నాన్న ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నారు. కానీ ఆ తర్వాత నా భర్త ఒప్పించాడు. నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. ఆపరేషన్ తర్వాత రక్తకణాల సంఖ్య తగ్గడంతో ప్లేట్ లెట్స్ ఎక్కించడంతో కోలుకున్నాను. ఆపరేషన్ తర్వాత ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెబితే నాన్న వినకుండా షూటింగ్స్ కు వెళ్లిపోయారు. కాలేయం పెరిగాక పిల్లలకు ప్లాన్ చేసుకున్నాం. పాప పుట్టగానే నాన్న సంతోషంతో ఏడ్చేశారు. ఆపరేషన్ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్తితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయారు. ఆపరేషన్ కోసం రూ.65 లక్షలు ఖర్చయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.