AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోర్‌బందర్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్

గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై ఇప్పటి వరకు కోస్ట్ గార్డ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

పోర్‌బందర్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్
Coast Guard Helicopter Crash
Balaraju Goud
|

Updated on: Jan 05, 2025 | 1:35 PM

Share

గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మరణానికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్  ALH ధృవ్ హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సాధారణ శిక్షణా విమానంలో కూలిపోయిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారి తెలిపారు.

గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తిందని, ఆ తర్వాత అది కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్‌లతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

భూమిని ఢీ కొట్టిన వెంటనే హెలికాప్టర్‌లో మంటలు చెలరేగడంతో పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, రెండు నెలల క్రితం కూడా ఇక్కడ ఇలాంటి ప్రమాదం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!