Human Trafficking: 59 మంది పిల్లలు అక్రమ రవాణా.. సమాచారం అందుకున్న పోలీసులు ఏం చేశారంటే

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రైలులో అక్రమంగా 59 పిల్లలను తరలించడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు పిల్లల్ని సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే బిహార్‌కు చెందిన 59 మంది చిన్నారులను దానాపూర్-పూణె ఎక్స్‌ప్రెస్‌ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది.

Human Trafficking: 59 మంది పిల్లలు అక్రమ రవాణా.. సమాచారం అందుకున్న పోలీసులు ఏం చేశారంటే
Children
Follow us

|

Updated on: May 31, 2023 | 8:47 PM

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రైలులో అక్రమంగా 59 పిల్లలను తరలించడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు పిల్లల్ని సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే బిహార్‌కు చెందిన 59 మంది చిన్నారులను దానాపూర్-పూణె ఎక్స్‌ప్రెస్‌ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఓ ఎన్జీవో సంస్థ సిబ్బంది, స్థానిక పోలీసులు, ఆర్పీఫ్ సిబ్బంది హుటాహుటీనా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయంపూట ఆ రైలు భూసావల్ రైల్వే స్టేషన్‌కు చేరింది. ఈ క్రమంలో పోలీసులు, ఆర్పీఫ్ సిబ్బంది అన్ని కంపార్ట్‌మెంట్‍‌లను తనిఖీ చేశారు. మొదటగా ఆ స్టేషన్‌లో 29 మంది పిల్లల్ని రక్షించారు.

ఆ తర్వాత మన్మాడ్ స్టేషన్‌కు ఆ రైలు చేరిన తర్వాత మరో 30 మంది పిల్లల్ని రక్షించారు. సుమారు 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ఈ 59 మంది పిల్లల్ని బిహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు, ఎన్జీఓ సిబ్బంది సహాకారం వల్లే పిల్లల అక్రమ రవాణాను అరికట్టినట్లు ఆర్పీఎఫ్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం