AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి చనిపోయాడు.. చైల్డ్ కానిస్టేబుల్ గా ఐదేళ్ల కొడుకు నియామకం

కుటుంబంలో తల్లీ లేదా తండ్రి అకస్మాత్తుగా చనిపోతే ఆ బాధ వర్ణించలేనిది. అయితే ఇటీవల చత్తీస్ గఢ్ లో మహిళా ఠానాలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి చనిపోవడంతో స్కూల్లో యూకేజీ చదువుతున్న తన కొడుకును చైల్డ్ కానిస్టేబుల్ గా నియమించారు.

తండ్రి చనిపోయాడు.. చైల్డ్ కానిస్టేబుల్ గా ఐదేళ్ల కొడుకు నియామకం
Child Constable
Aravind B
|

Updated on: Mar 24, 2023 | 2:18 PM

Share

కుటుంబంలో తల్లీ లేదా తండ్రి అకస్మాత్తుగా చనిపోతే ఆ బాధ వర్ణించలేనిది. అయితే ఇటీవల చత్తీస్ గఢ్ లో మహిళా ఠానాలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి చనిపోవడంతో స్కూల్లో యూకేజీ చదువుతున్న తన కొడుకును చైల్డ్ కానిస్టేబుల్ గా నియమించారు. వివరాల్లోకి వెళ్తే చతీస్ గఢ్ సర్గుజా లోని రాజ్ కుమార్ రాజ్వాడే  అనే వ్యక్తి పోలీస్ అధికారిగా పనిచేస్తు తన భార్య కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రాజ్ కుమార్ మృతి చెందాడు. దీంతో వాళ్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆ తర్వాత రాజ్ కుమార్ కుమారుడైన నమన్ రాజ్వాడే (5)  ను చైల్డ్ కానిస్టేబుల్ గా నియామకం చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్ల మార్గదర్శకాల ప్రకారం ఒక వేళ పోలీసు అధికారి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబంలో 18 ఏళ్ల లోపు ఉన్నవారికి కానిస్టేబుల్ గా అవకాశం కల్పిస్తారు. ఈ నిబంధన ప్రకారమే పాఠశాలలో యూకేజీ చదువుతున్న నమన్ ను చైల్డ్ కానిస్టేబుల్ గా నియమించారు. ఈ మేరకు సుపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ భవాని గుప్త అడ్మినిస్ట్రేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మార్గదర్శకాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాజ్ కుమార్ భార్య నీతు రాజ్వాడే  తన భర్త చనిపోయినందుకు బాధగా ఉందని.. కాని తన కుమారుడు చైల్డ్ కానిస్టేబుల్ కావడంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన యంగ్‌ బ్యూటీ!
కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన యంగ్‌ బ్యూటీ!